మార్కెట్లోకి వచ్చేసిన హీరో విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్..

హీరో మోటోకార్ప్ తన విడా విడా బ్రాండ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘విడా VX2’ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది కంపెనీ విడా సిరీస్‌లో అత్యంత చౌకైన మోడల్‌గా నిలిచింది. ఈ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేశారు. VX2 Go, VX2 Plus.

ధర పరంగా.. VX2 Go వేరియంట్ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో రూ. 59,490 (ఎక్స్‌ షోరూమ్)గా, సబ్‌స్క్రిప్షన్ లేకుండా రూ. 99,490గా కంపెనీ పేర్కొంది. మరోవైపు.. VX2 Plus వేరియంట్ ధర బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో రూ. 64,990 కాగా, సబ్‌స్క్రిప్షన్ లేకుండా రూ. 1.10 లక్షలుగా నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ విషయానికి వస్తే.. VX2 Goలో ఉండే 2.2 kWh బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 92 కి.మీ వరకు రన్ అవుతుంది. అలాగే, VX2 Plusలో ఉండే 3.4 kWh సామర్థ్యం గల బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 142 కి.మీ వరకు ప్రయాణించగలదు.

ఇక, ఫీచర్లు పరంగా.. ఈ రెండు వేరియంట్లలో 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, క్లౌడ్ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ స్కూటర్లను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. VX2 మొత్తం 7 రంగుల్లో అందుబాటులో ఉంది. కానీ, VX2 Plus కేవలం రెండు రంగుల్లో లభిస్తుంది. హీరో ఈ స్కూటర్లపై 5 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ వారంటీని అందిస్తోంది. ఇది బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీగా నిలుస్తోంది.

 

ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలి: ఆనం

Anam Ramanarayana Reddy firi jagan

అమరావతి: ఎపి విఆర్ హైస్కూల్ లో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) తెలిపారు. విఆర్ హైస్కూల్ పేరు మార్చడంపై మంత్రి ఆనం అభ్యంతరం తెలిపారు. నెల్లూరు విఆర్ స్కూల్ ప్రారంభ కార్యక్రమంలో ఆనం వివాద వ్యాఖ్యలు చేశారు. విఆర్ విద్యాసంస్థలు తమ కుటుంబం పర్యవేక్షణలో ఉన్నాయని అన్నారు. వైసిపి ప్రభుత్వం కక్షతో మేనేజింగ్ కమిటీ అధ్యక్ష పదవి (Chairmanship Committee) నుంచి నన్ను తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థగా మారిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యాసంస్థల ద్వారా ఎదిగాకే మంత్రి నారాయణ రాజకీయాల్లోకి వచ్చారని తెలియజేశారు. తమ కుటుంబం మొదటి నుంచీ రాజకీయాల్లోనే ఉంది ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

కన్నప్పలో ఆ పాత్రలు ఇరిటేషన్ తెప్పించాయి: తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bharadwaja

హైదరాబాద్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. జూన్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) ఈ సినిమా గురించి మాట్లాడారు. సినిమా బాగుందని చెప్పిన ఆయన.. అన్ని కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదని అన్నారు. సినిమా రూ.200 కోట్లతో నిర్మిస్తే.. పది రోజుల్లో కేవలం రూ.50 కోట్లు కూడా వసూలు చేయలేకపోయిందని.. దీంతో నిర్మాత మోహన్‌బాబుకు తీవ్ర నష్టం వచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) మాట్లాడుతూ.. సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచన చేశారు కానీ.. భక్తి తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భక్తే ప్రధానంగా సినిమా తీసి ఉంటే రూ.1000 కోట్ల కలెక్షన్లు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. సినిమాలో అందరూ చాలా బాగా నటించాని కితాబిచ్చిన ఆయన.. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్‌ను చూస్తుంటే తనకు ఇరిటేషన్ వచ్చిందని తెలిపారు. కన్నప్ప సినిమా చూస్తున్నంత సేపు ‘అన్నమయ్య’ సినిమా కాన్సెప్టు గుర్తుకు వచ్చిందని పేర్కొన్నారు. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ తీసుకున్నారని అన్నారు. ఏదేమైనప్పటికీ.. కన్నప్ప విషయంలో బాగా కష్టపడిన విష్ణును అభినందించాలని తెలిపారు. కానీ, ఆ కష్టానికి తగిన ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాను కొందరు ట్రోల్ చేసినా.. బ్యాడ్ రిపోర్టు రాలేదని.. ఒక్కసారి అయినా చూడాల్సిన సినిమాగా రివ్యూలు వచ్చాయన్నారు.

కెసిఆర్ కుటుంబంపై కాంగ్రెస్ కు ఎందుకంత ప్రేమ? బండి

Bandisanjay comments BRS

హైదరాబాద్: తెలంగాణ కోసం మాజీ సిఎం కెసిఆర్ కు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మద్దతు తెలిపిందని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ (Bandisanjay) తెలిపారు. తన కొడుకు ఖరీదైన బట్టలు వేసుకుంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఓర్వలేకపోయారని అన్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి స్థాయి కంటే కెటిఆర్ ది తక్కువ స్థాయని చెప్పారు. కెసిఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఉద్యమాన్ని ఆంధ్రజ్యోతి నడిపిందని తెలియజేశారు. ఎబిఎన్ పై దాడిచేసి చూడు.. నీ బిఆర్ఎస్ ను ఏం చేస్తామో తెలుస్తుంది అని మండిపడ్డారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని స్థాయిలో ఉందని, కెసిఆర్ కుటుంబంపై కాంగ్రెస్ కు ఎందుకంత ప్రేమ? అని కెసిఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? అని ప్రశ్నించారు. వాడు వీడు అని ఇష్టానుసారంగా మాట్లాడితే.. కెసిఆర్ కుటుంబం కార్లు కూడా తిరగనివ్వం అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం (Telangana State) రాకముందు..తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని నిలదీశారు. కెసిఆర్ కుటుంబానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ధ్వజమెత్తారు. కెటిఆర్ కు అహంకారం తగ్గలేదు అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

ఇంత విషాదంలో కూడా.. అదిరిపోయే ప్రదర్శన చేసిన ఆకాశ్‌దీప్

Akashdeep

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో పేసర్ ఆకాశ్‌దీప్ సింగ్ (Akashdeep) అదరగొట్టాడు. తన రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతను పది వికెట్లు తీశాడు. అయితే తన ఇంట విషాదం ఉన్నా కూడా అతను దేశం కోసం ఆడాడు. ఆకాశ్‌దీప్ బిసిఎ నుంచి బ్యాన్‌ని ఎదురుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే తన తండ్రి పక్షవాతంతో ప్రాణాలు వదిలేశారు. అది జరిగిన రెండు నెలలకే అతని సోదరుడు కూడా మృతి చెందాడు. ప్రస్తుతం అతడి సోదరి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శనని ఆకాశ్ తన సోదరి జ్యోతి సింగ్‌కు అంకితం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోతి సింగ్.. తన ఆరోగ్య పరిస్థితి, ట్రీట్‌మెంట్‌తో పాటు.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు ఆకాశ్‌తో మాట్లాడిన విషయాలను ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తన సోదరుడు దేశం గర్వపడేలా ప్రదర్శన చేశాడని.. పది వికెట్లు తీయడం అద్భుతమని ఆమె కొనియాడారు. ‘‘ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు ఎయిర్‌పోర్టులో మేం కలుసుకున్నాం. అప్పుడు నా ఆరోగ్యం బాగుందని.. నా గురించి ఆందోళన వద్దని చెప్పాను. ప్రస్తుతం నేను మూడో స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. దీనికి కనీసం ఆరు నెలల ట్రీట్‌మెంట్ అవసరమని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఆకాశ్ వికెట్ తీసినప్పుడల్లా మేం ఎంతో సంతోషించాం. నా గురించి మీడియాతో చెబుతాడని అనుకోలేదు. ఎంతో భావోద్వేగానికి గురై అలా అంకితం చేశాడు. అతనికి మాపై ఉన్న ప్రేమ అలాంటిది. మ్యాచ్ ముగిసిన తర్వాత వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం. ‘కంగారు పడొద్దు దేశం మొత్తం మనకు అండగా ఉంది’ అని చెప్పాడు. ఆ మాటలు విని ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. మా నాన్న, అన్నయ్య లేనప్పటికి ఆకాశ్ (Akashdeep) కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఇలాంటి సోదరుడు ఉండటం చాలా అదృష్టం’’ అని జ్యోతి సింగ్ పేర్కొన్నారు.

గిల్‌ని ఊరిస్తున్న అనితర సాధ్యమైన రికార్డు.. అదేంటంటే..

Shubman Gill

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన అతను రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును కైవసం చేసుకున్నాడు. ఇలా మరిన్ని రికార్డులను కూడా తిరగరాశాడు గిల్.

అయితే ఇప్పుడు ఓ అరుదైన, అనితర సాధ్యమైన రికార్డు గిల్‌ను (Shubman Gill)) ఊరిస్తోంది. గిల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే 585 పరుగులు చేశాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఐదు అంతకంటే తక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో (విదేశాల్లో) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లెజెండ్ డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును గిల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. బ్రాడ్‌మాన్ 1930లో ఇంగ్లండ్ పర్యటనలో 974 పరుగులు చేశారు. 95 ఏళ్లుగా ఈ రికార్డును ఎవరూ చేధించలేకపోయారు. ఆ తర్వాతి స్థానంలో వాలీ హేమాండ్(905 పరుగులు), మూడో స్థానంలో నీల్ హార్వే(834 పరుగులు), నాలుగో స్థానంలో వివ్ రిచర్డ్స్ (829 పరుగులు), ఐదో స్థానంలో క్లైడ్ వాల్కాట్ (827 పరుగులు) ఉన్నారు. గిల్ ఈ సిరీస్‌లో ఈ జాబితాలో స్థానం సంపాదించుకొనే అవకాశం ఉంది.

భారత్‌ తరఫున ఈ రికార్డు సునీల్‌ గవాస్కర్‌ పేరిట ఉంది. గవాస్కర్‌ 1970/71 వెస్టిండీస్‌ పర్యటనలో 4 మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేశాడు. గవాస్కర్‌ తర్వాత ఈ రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. విరాట్‌ 2014/15 ఆస్ట్రేలియా పర్యటనలో 692 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గిల్ ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్ ముగిసేలోపు గిల్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

వన్డేల్లో తొలి ఆటగాడిగా.. శ్రీలంక ప్లేయర్ అరుదైన రికార్డు

Wanindu Hasaranga

కొలంబో: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రండో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక స్టార్ ఆటగాడు వనిందు హసరంగా (Wanindu Hasaranga) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిపాలైనప్పటికీ.. బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో అంతంత మాత్రమ ప్రదర్శన చేశాడు. 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో అతను ఓ రేర్ ఫీట్‌ని తన పేరిట లఖించుకున్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులతో పాటు.. 100 వికెట్లు తీసిన ఆటగాడిగా హసరంగా (Wanindu Hasaranga) నిలిచాడు. 65 మ్యాచుల్లో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ షాన్ పొలాక్ పేరిట ఉండేది. పొలాక్ 68 వన్డేల్లో ఈ రికార్డు సాధించారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసి శ్రీలంక 48.5 ఓవర్లలో 25 232 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1గా సమం చేసింది.

సిగాచి పరిశ్రమ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలి: హరీష్ రావు

Harish Rao comments Congress Govt

హైదరాబాద్: రియాక్టర్ పేలుడులో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేలుడులో ఎంతమంది చనిపోయారో క్లారిటి ఇవ్వాలని అన్నారు. ప్రమాదంపై న్యాయ విచారణ (judicial inquiry) జరపాలని డిమాండ్ చేశారు. పాశమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగే బాంబు పేలుడు ఇది మూడో ఘటన అని హరీష్ రావు పేర్కొన్నారు.

తెలంగాణలోని అంగన్ వాడీలకు కేంద్ర వాటా నిధులు పెంచాలి: సీతక్క

More funds state Allocation

హైదరాబాద్: ఏ రాష్ట్రంలో లేని అంగన్ వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పిస్తాం అని మంత్రి సీతక్క(Sitakka) అన్నారు. కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవితో సమావేశమయ్యారు. శిశు సంక్షేమ శాఖకు మరిన్ని నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలోని అంగన్ వాడీలకు కేంద్ర వాటా నిధులు (Central share funds) పెంచాలని  అన్నపూర్ణ దేవిని సీతక్క కోరారు. సీతక్క వెంట తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్ ఉన్నారు. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న స్కీమ్ లకు రాష్ట్రానికి ఎక్కువ నిధులను కేటాయించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.

రాజాసింగ్ సంచలన నిర్ణయం.. బిజెపికి రాజీనామా.!

Rajasingh

హైదరాబాద్: బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రామచంద్రరావుకు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంపై అసంతృప్తి చెందానని ఆయన తెలిపారు. బిజెపి అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి తాను పార్టీ ఆఫీస్‌కు వచ్చానని.. ఆ సమయంలో తన మద్దతుదారులను బెదిరించారని ఆయన ఆరోపించారు. తన రాజీనామా లేఖను కిషన్‌రెడ్డికి అందించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ చేశారని అన్నారు. పార్టీ సింబల్ మీద తాను గెలిచానని.. స్పీకర్‌కు కూడా రాజీనామా లేఖను కిషన్‌రెడ్డినే పంపించాలని ఆయన పేర్కొన్నారు. మీకో దండం, మీ పార్టీకో దండం అని ఆయన అన్నారు.

కొందరు నేతలు వ్యక్తిగత ప్రయోజనాలతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని రాజాసింగ్ (Rajasingh) పేర్కొన్నారు. తాను, తన కుటుంబం టెర్రరిస్టు టార్గెట్‌లో ఉందని తెలిపారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని ఎంతో పోరాడుతున్నామని.. కానీ పార్టీ అధికారంలోకి రావొద్దని కోరుకునే వారే పార్టీలో ఎక్కువ మంది ఉన్నారన్నారు. పార్టీ కోసం ఇంత పని చేసిన మాకు ఏం లాభం అని ప్రశ్నించారు. పార్టీకి రాజీనామా చేశాను కానీ.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.