‘హరిహర వీరమల్లు’ నుంచి ‘ఎవరది ఎవరది’ పాట విడుదల

Hari Hara Veera Mallu

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలతో పాటు రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌ వరకూ ప్రతీది ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎవరది ఎవరది’ పాటను విడుదల చేశారు. ‘ఎవరది ఎవరది.. అతగాడో పొడుపు కథ.. దొరకనే దొరకడు అతగాడో మెరుపు కథ’ అంటూ సాగే ఈ పాట పవన్‌ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. చిత్రం కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా.. మిగితా భాగం నిర్మాత ఎఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి భాగం ‘హరిహర వీరమల్లు – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hari Hara Veera Mallu) జూలై 24వ తేదీన విడుదల కానుంది.

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. ఒకరు మృతి

Fighter Jet

రతన్‌ఘర్: రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌ఘర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్ విమానం (Fighter Jet) కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఆకాశంలో ఉండగానే విమానం నియంత్రణ కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. విమానం కూలిన పొలాల్లో కూలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేశామని చెప్పారు. కూలిన విమానం నుంచి ఒకరి మృతదేహాన్ని బయటక తీశామని స్థానికులు పేర్కొన్నారు. అయితే భారత వాయుసేన మాత్రం ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలైనట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనస్థలానికి చేరుకొని ఘటన ఎలా జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు.

మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: జగన్

Jagan comments chandrababu naidu

అమరావతి: ఎపి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. మామిడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరులోని బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. కూటమి పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని, ప్రభుత్వమే రైతులపై కుట్రలు చేయడం దారుణం అని మండిపడ్డారు. రైతులను రాకుండా చేసేందుకు పోలీసులు మోహరించారని, రైతులను కలవకుండా ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.

అయినా వేలమంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారని అన్నారు. రైతులను రౌడీషీటర్లతో పోలుస్తారా? అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు (crop profitable state) ధర లేదని, కిలో మామిడి 2 రూపాయలా? ఇదేం దారుణం అని ఆశ్చర్యపోయారు. తమ హయాంలో రూ.22 నుంచి రూ. 29కి కొన్నామని, కర్ణాటకలో కిలో మామిడిని రూ.16 కి కేంద్రం కొంటుంటే…రాష్ట్రంలో  సిఎం చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నారా? అని లక్షల మెట్రిక్ టన్నుల్లో మామిడి ఉందని బాబుకు తెలియదా? అని ఎద్దేవా చేశారు. మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సూచించారు.

వెంటనే 76 వేల మంది రైతుల పంట కొనుగోలు చేయాలని, ప్రతి రైతుకు వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల పక్షాన నిలబడి తానే ముందుండి పోరాడతానని తెలియజేశారు. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా? అని రైతుల తలలు పగలకొడతారా? 1200 మందిని జైల్లో పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రలోభాలు, లంచాలకు పోలీసులు లొంగొద్దు అని రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేస్తారని హితవు పలికారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే.. ఇది గుర్తు పెట్టుకోండి అని జగన్ సవాల్ విసిరారు.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన గిల్.. ఏ స్థానంలో నిలిచాడంటే..

ICC Test Rankings

ఐసిసి తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను (ICC Test Rankings) ప్రకటించింది. ఈసారి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా భారత టెస్ట్ కెప్టె‌న్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మాన్ గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, రెండో టెస్ట్‌ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన గిల్ 15 స్థానాలు మెరుగుపరుచుకొని.. తాజా ర్యాంకింగ్స్‌లో 807 పాయింట్లతో ఆరో స్థానంలో స్థిరపడ్డాడు. గిల్‌తో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానం, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

ఇక తాజా ర్యాంకింగ్స్‌లో (ICC Test Rankings) ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు. రెండో టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన బ్రూక్ జో రూట్‌ను 886 పాయింట్లతో వెనక్కి నెట్టి ప్రపంచ నెం.1 టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక రెండో టెస్ట్‌లో బ్రూక్‌తో పాటు అద్భుత ప్రదర్శన చేసిన జేమీ స్మిత్ 753 పాయింట్లో పదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. 898 పాయింట్లతో జస్ప్రీత్ బుమ్రా నెం.1 ర్యాంకులో ఉండగా.. సఫారీ బౌలర్ కగిసో రబాడా 851 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా ప్రజాపాలన నడుస్తోంది: వివేక్ వెంకటస్వామి

Democratic governance running

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మంత్రులతో ప్రజలు నేరుగా కలిసి సమస్య చెప్పుకునే అవకాశం ఉండటం చాలా బాగుందని మంత్రి  జి.వివేక్ వెంకటస్వామి (G.Vivek Venkataswamy) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా ప్రజాపాలన నడుస్తోందని అన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ..మంత్రులతో ముఖాముఖి చాలా మంచి కార్యక్రమం అని తెలియజేశారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా ప్రజాస్వామ్య పాలన నడుస్తోందని, జిల్లాల్లో కూడా కలెక్టర్లు ప్రజాపాలనను సమర్థవంతంగా (Effective public administration) నిర్వహిస్తున్నారని, గ్యారంటీల అమలును పరిశీలించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

రీల్స్‌ కోసం కన్న కూతురి ప్రాణాలతో చెలగాటం..

Rajasthan Parents

రీల్స్ చేసి సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వడానికి కొత్త కొత్త మార్గలు వెతుకుతున్నారు కొందరు. అందులో కొన్ని ప్రాణాంతకం అవుతున్నాయి. అలా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసి కూడా అలాంటి రిస్కీ రీల్స్ చేసే వాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా ఓ తల్లిదండ్రులు (Rajasthan Parents) రీల్ కోసం ఏకంగా తమ కూతురి ప్రాణాలతో చెలగాటం ఆడారు.

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో బరేథా జలాశాయం వద్ద ఓ జంట తమ ఏడేళ్ల కూతురిని జలాశయం గోడకు ఉన్న రాడ్స్‌పై అమర్చిన విద్యుత్ బాక్స్‌పై కూర్చోబెట్టారు. ఆ చిన్నారి అక్కడకు వెళ్లేందుకు భయపడుతున్నా.. వాళ్లు మాత్రం ఆమెని ప్రోత్సాహించారు. కొంచెం అదుపు తప్పిన ఆ చిన్నారి జలాశయంలో పడిపోయే ప్రమాదం ఉండేది. కానీ, ఆ జంట (Rajasthan Parents) మాత్రం దాన్ని పట్టించుకోలేదు. విద్యుత్ బాక్స్‌పై కూర్చోగానే కెమెరాని చూడమంటూ సైగ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

పిల్లలకు అలాంటి లైఫ్ రిస్క్ పనులు చేయవద్దని చెప్పాల్సిన తల్లిదండ్రులే ఇలాంటి పనులు చేయాలని ప్రోత్సహించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని దానిపై తగిన చర్యలు తీసుకుంటామని బరేథా పోలీసులు తెలిపారు. సందర్శకుల భద్రత దృష్ట్యా జలాశయం వద్ద ఓ కానిస్టేబుల్‌‌ని ఏర్పాటు చేశామన్నారు.

ఎపి బ్రాండ్ ను దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు : పయ్యావుల

Payyavalu Keshav counter Jagan

అమరావతి: ఎపిలో ఏదో జరుగుతుందని మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) తెలిపారు. జగన్ కు పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎపి బ్రాండ్ ను దెబ్బతీసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నానని అన్నారు. ఎపిలో పరిశ్రమలు (Industries AP) పెట్టొద్దని పారిశ్రామిక వేత్తలకు ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో రెండు వందల మెయిల్స్ పెట్టించారని మండిపడ్డారు. ఆ తర్వాత లేళ్ల అప్పిరెడ్డిని తెరపైకి తెచ్చారని తెలియజేశారు. ఎన్ని కుట్రలు చేసినా ఎపి బ్రాండ్ ఎక్కడా తగ్గలేదని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

మూడో టెస్ట్‌ బెన్‌ స్టోక్స్‌కు పెద్ద పరీక్ష: మైఖేల్ అథర్టన్

Ben Stokes

ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో భారత్‌ను ఓడించాలని అనుకుంటోంది. జూలై 10వ తేదీ నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌కు (Ben Stokes) సవాల్ వంటిదని మాజీ ఆటగాడు మైఖేల్ ఆథర్టన్ అభిప్రాయపడ్డారు. ఈ టెస్ట్‌లో అతడు కఠినమైన సవాళ్లు ఎదురుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ టెస్ట్ మ్యాచ్ అతని నాయకత్వ పటిమ, మానసిక, శారీరక సామర్థ్యానికి పెద్ద పరీక్ష అని ఆయన అన్నారు.

రెండో మ్యాచ్‌లో టాస్ సమయంలో పొరపాటు జరిగిందని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అంగీకరించారు. దీంతో స్టోక్స్ (Ben Stokes) కెప్టెన్సీ సామర్థ్యంపై అనుమానాలు వచ్చాయి. అయితే రాబోయే రెండు రోజులు స్టోక్స్‌కు చాలా ముఖ్యమని అథర్టన్ అన్నారు. ‘‘మొదటి టెస్ట్‌, రెండో టెస్ట్ మ్యాచ్‌కి మధ్య ఏడు రోజుల సమయం దొరికింది కానీ, రెండో టెస్ట్‌, మూడో టెస్ట్‌కి కేవలం మూడు రోజుల సమయమే ఉంది కాబట్టి.. ఆ సమయం స్టోక్స్‌కి ఎంతో ముఖ్యం. ఆ సమయంలోనే తిరిగి పుంజుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఇంగ్లండ్ బ్యాటింగ్‌పై విశ్వాసం ఉందని.. సీమ్ దాడిని బలోపేతం చేయాలని.. అందుకు జోష్ టంగ్, బ్రైడన్ కార్స్ స్థానంలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు.

కృష్ణా, గోదావరి బేసిన్ జలాలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమే: భట్టి

Bhatti Vikramarka fire Brs

హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లెక్కలు తీసుకొని అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఒకరికి సవాల్ విసిరితే మరొకరు బయటకు వచ్చారు అని అన్నారు. మహబూబాబాద్ లో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రూ. లక్ష రుణమాఫీ విషయంలో మాజీ సిఎం కెసిఆర్ రెండుసార్లు మోసం చేశారని మండిపడ్డారు.

తొలిసారి రుణమాఫీ (Loan waiver first time) పూర్తి చేసేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ నేతలు పదేళ్లలో రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి బేసిన్ జలాలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. కాళేశ్వరం నిర్మించి పది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని, అసత్యాలు మానకపోతే.. బిఆర్ఎస్ కు డిపాజిట్లు రావు అని అన్నారు. నోరుందికదా అని కెటిఆర్ ఏది పడితే అది మాట్లాడమేనా? అని భట్టి ప్రశ్నించారు.

భద్రాచలం ఇవొపై గ్రామస్థుల దాడి.. కారణం ఏంటంటే..

Bhadrachalam EO

భద్రాచలం: భద్రాచలం ఆలయ ఇవొ (Bhadrachalam EO) రమాదేవిపై ఓ గ్రామస్థులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందకు వెళ్లిన ఆమెపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, గ్రామస్థుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పురుషోత్తపట్నంలో భద్రాది ఆలయానికి చెందిన 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఎపి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా కొందరు ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడకు వెళ్లిన ఇవొపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇవొ రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.