రెచ్చిపోయిన కన్వర్ యాత్రకులు.. సిఆర్‌పిఎఫ్ జవానుపై దాడి

Kanwar Tourists

మీర్జాపూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌లో కన్వర్ యాత్రికులు (Kanwar Tourists) రెచ్చిపోయారు. ఓ సిఆర్‌పిఎఫ్ జవానుపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. శనివారం ఈ ఘటన జరిగింది. సిఆర్‌ఫిఎఫ్‌కి చెందిన గౌతమ్ అనే జవాను బ్రహ్మపుత్ర మొయిల్ కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు కన్వర్ యాత్రికులతో టికెట్ విషయంలో గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో కన్వర్ యాత్రికులు సదరు జవానును చితకబాదారు. నేల మీద పడిన అతనిపై పిడిగుద్దులు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ దాడికి పాల్పడిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ చమన్ సింగ్ తెలిపారు.

కూటమి నేతలు పచ్చి అబద్దాలు చెప్తున్నారు: సజ్జల

Sajjala Ramakrishna Reddy fire chandra babu naidu

అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. ప్రజల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డికి మద్దతుగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను కప్పిపుచ్చుందుకే అక్రమంగా అరెస్టులు (Illegal arrests) పెడుతున్నారని, పక్కా ఆధారాలతో గతంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారని అన్నారు. ఎంపి మిథున్ రెడ్డిది అక్రమ అరెస్టు అని మద్యం కేసు అంతా ఊహాజనితమే అని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మద్యం నియంత్రణ కోసం పని చేశామని తెలియజేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఏవిధంగా స్కాం జరుగుతుందో తెలియాలని చెప్పారు. కూటమి నేతలు పచ్చి అబద్దాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తున్నాం అని లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికీ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారని సజ్జల పేర్కొన్నారు.

సచిన్ పక్కన నా పేరు ఉండటం గొప్ప గౌరవం: అండర్‌సన్

James Anderson

ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో పటౌడీ ట్రోఫీగా ఉన్న ఈ ట్రోఫీకి తాజాగా టెండూల్కర్-అండర్‌సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. దీనిపై తాజాగా జేమ్స్ అండర్‌సన్ (James Anderson) స్పందించారు. సచిన్ పక్కన తన పేరు ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. తొలిసారి ఇలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

‘‘సచిన్ టెండూల్కర్ ప్రస్తుత క్రికెటర్లలో ఓ దిగ్గజం. అలాంటి క్రికెటర్‌తో కలిసి ట్రోఫీని పంచుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన పేరు మీద ట్రోఫీ ఉండటం పెద్ద విషయమే. అందులోనూ కప్ పక్కన సచిన్‌తో కలిసి నా పేరు ఉండటం భిన్నమైన అనుభూతి. సచిన్ ఆట చూస్తూ పెరిగాను. అతడిని ప్రత్యర్థిగా ఆడాను. భారత్ ఆశలను తన భుజాలపై మోసిన ఐకానిక్ ప్లేయర్ సచిన్. అలాంటి క్రికెటర్‌తో కలిసి ట్రోఫీని ఆవిష్కరిండం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. క్రికెట్‌లో నేను సాధించిన దాని గురించి అభిమానులు మాట్లాడుకొనేప్పుడు.. నేనేనా ఇదంతా సాధించింది అని అనిపిస్తుంది’’ అని అండర్‌సన్ (James Anderson) అన్నారు.

రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలో ఆదివారం 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని భూకంప పర్యవేక్షణ సంస్థలు తెలిపాయి. దీనికి కొన్ని నిమిషాల ముందు రిక్టర్ స్కేలుపై 6.6, 6.7 తీవ్రతలతో జంట భూకంపాలు సంభించినట్లు తెలిపాయి. ద్వీపకల్పంలో రెండు భూకంపాలు సంభవించిన నేపథ్యంలో పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఆ ప్రాంతానికి సునామీ హెచ్చరికలను జారీ చేసింది. రెండో భూకంపం పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కమ్చట్కా తీరానికి సమీపంలో సంభవించిన భూకంపాల 10 కిలోమీటర్ల లోతులో గుర్తించింది. ఈ భూకంపాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీరం సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

‘‘హరిహర వీరమల్లు’’కు షాక్.. నిర్మాతకు నోటీసులు

Hari Hara Veera Mallu

హైదరాబాద్: పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). అయితే ఈ సినిమా విడుదకు ముందు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా ఎ ఎం రత్నంకు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ‘టిఎష్‌సిసి)లో రెండు వేర్వేరు ఫిర్యాదులు చేశాయి. పైజాం డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి రెండు సినిమాలకు ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సి డబ్బును ఇవ్వలేదన ని ఆపించాయి.

రత్నం నిర్మించిన ‘ఆక్సిజన్’ సినిమాకి సంబంధించి దాదాపు రూ.రెండున్నర కోట్లు రికవరీపై ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్, ‘ముద్దుల కొడుకు’ , ‘బంగారం’ చిత్రాలకు సంబంధిచిన రూ.90వేల రికవరీపై మహాలక్ష్మీ ఫిలిమ్స్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) విడుదలకు ముందే తమ బాకీలు వసూలు చేయడంలో సహాయం చేయాలని అభ్యర్థించాయి. ఇతర డిస్ట్రిబ్యూటర్లు కూడా తమకు సహాయం చేయాలని కోరాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కీరవాణీ సంగీతం అందించిన ఈ సినిమాను కొంత భాగం క్రిష్, మిగితా భాగం ఎఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. జూలై 24వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోంది: అశ్వినీ వైష్ణవ్

Kazipet Railway Coach Industry

హైదరాబాద్: వరంగల్ ప్రజల కోరికను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. కాజీపేట రైల్వేకోచ్ పరిశ్రమ అనేది వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్రమంత్రులు పరిశీలించారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా సాగుతున్నాయని తెలియజేశారు.2026లో ఇక్కడ రైల్వే కోచ్ పనులు ప్రారంభం అవుతాయని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.

కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ అనేది 40 ఏళ్ల పోరాటమని, పివి నరసింహారావు కూడా కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించారని కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే వ్యాగన్లు, కోచ్ లు, ఇంజిన్ల తయారీ పరిశ్రమను కాజీపేటకు ప్రధాని మంజూరు చేశారని, మోడీ ఏదైనా మాట ఇస్తే.. తప్పకుండా నెరవేరుస్తారని పేర్కొన్నారు.మోడీ గ్యారెంటీకి ప్రతిరూపమే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అని కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని స్వయంగా భూమిపూజ చేశారని అన్నారు.

కోచ్ ఫ్యాక్టరీతో 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తామని, తెలంగాణలోని 40 వేల రైల్వే స్టేషన్లను ఆధునికరిస్తున్నాం అని తెలియజేశారు. వరంగల్ కు ఎయిర్ పోర్టు కూడా ఇప్పటికే రావాల్సి ఉందని, ఎయిర్ పోర్టుకు భూములివ్వాలని గతంలో మాజీ సిఎం కెసిఆర్ ను కోరామని చెప్పారు. భూసేకరణ గురించి ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నామని, ఎంత త్వరగా భూములిస్తే.. అంత త్వరగా ఎయిర్ పోర్టు పూర్తవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మలక్‌పేట్ కాల్పుల కేసును చేధించిన పోలీసులు

Police crack Malakpet shooting case

హైదరాబాద్‌: మలక్‌పేట్ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందు నాయక్‌ను వివాహేతర సంబంధం కారణంగానే నిందితులు హత్య చేశారు. వివాహేతర సంబంధం, గుడిసెలు కట్టడంతో పాటు వ్యక్తిగత కారణాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. బీహార్‌ నుంచి తుపాకులు తీసుకొచ్చి చందు నాయక్ ను ప్రత్యర్థులు హత్య చేశారు. హైదరాబాద్ మలక్‌పేట్‌లోని శాలివాహన నగర్ పార్క్ వద్ద మంగళవార ఉదయం సిపిఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్ కు వెళ్లారు. అదే సమయంలో ఆయనపై దుండగులు తుపాకులతో  కాల్చి చంపిన విషయం తెలిసిందే.

రెండు గంటల్లో హైదరాబాద్ లో వర్షం

Heavy rains in Hyderabad

హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో రెండు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురువనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటల తరువాత శంషాబాద్, రాజేంద్రనగర్, బాలాపూర్, చాంద్రాయణగుట్ట, హయత్ నగర్, మియాపూర్, శేరిలింగంపల్లి, మియాపూర్, ఆర్ సిపురం, బీరంగూడ ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. నిన్నం భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఐటి జోన్ లో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలను వరద ముంచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు జిహెచ్ ఎంసి సిబ్బంది బోట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

 

పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదు: నిమ్మల

Nimmala Ramanaidu comments jagan

అమరావతి: గత ప్రభుత్వ తప్పిదాలు సరిచేస్తూ రాష్ట్ర పాలనను గాడిలో పెడుతున్నామని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరిమేశారని అన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ..గత ఐదేళ్లలో ఇసుక, భూములు, గనులు, లిక్కర్ ను లూటీ చేశారని విమర్శించారు. జగన్ లూటీ చేసిన ప్రజాధనాన్ని కక్కిస్తాం అని తెలియజేశారు. గత ప్రభుత్వం గనుల యజమానులను బెదిరించి డబ్బు దోచుకున్నారని మండిపడ్డారు. వృథాగా పోయే నీటినే బనకచర్లకు ఉపయోగిస్తామని, పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని అన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉందని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

బిఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి: ఈటల

Huzurabad place sacrifices

హైదరాబాద్: కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు. హుజురాబాద్ అనేక త్యాగాలకు అడ్డా అని అన్నారు. హుజూరాబాద్ బిజెపి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ నుంచే అనేక పోరాటాలు చేశానని, బిఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలియజేశారు.  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల విషయంలో తాను మోహమాటం లేకుండా చెప్పానని ఈటల వివరించారు. గతంలో హుజురాబాద్ ఉపఎన్నికల్లో (Huzurabad election) ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.