Mega 157: చిరంజీవి కనిపించేది ఈ పాత్రలోనే..?

Mega 157

తనదైన స్టైల్ కామెడీతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఆకట్టుకొనే సినిమాలు తీయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి ముందుంటారు. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలు అన్ని బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘మెగా 157’ (Mega 157) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో చిరంజీవి మాస్టర్, ఠాగూర్ చిత్రాల్లో లెక్చరర్ పాత్రలో నటించారు. కాగా, ఈ సినిమాలో (Mega 157) ఆయన స్కూల్ డ్రిల్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. గురువారం ముస్సోరీలో ఈ సినిమా రెండో షెడ్యూల్‌లో స్కూల్ నేపథ్యంలోని సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తారని రూమర్స్ వస్తున్నాయి. హీరోయిన్ క్యాథరీన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

రాష్ట్రంలో చిల్లర పంచాయితీలు పెడుతున్నది కెసిఆర్, హరీష్ రావు: ఆది శ్రీనివాస్

Banakacharla divert farmers

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు నీటి విషయంలో సమస్య పరిష్కారం అవుతుందనే భయంతో ఉన్నారని,  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎన్ వొసి ఇచ్చాక నీరు వాడుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి చెబితే, హరీష్ రావు తప్పుపడుతున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం అయితే మాట్లాడడానికి మరో అంశం ఉండదనే అభద్రత భావంతో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో చిల్లర పంచాయితీలు పెడుతున్నది మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అని మండిపడ్డారు. గతంలో తెలంగాణకు ద్రోహం (Betrayal Telangana) చేసింది కెసిఆర్, హరీష్ రావు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కెసిఆర్, హరీష్ రావు చర్యల వల్ల తెలంగాణ నష్టపోతుందని, బిఆర్ఎస్ పాలన నుంచే తెలంగాణకు నష్టం జరుగుతోందని చెప్పారు. రైతులను డైవర్ట్ చేయడానికి బనకచర్ల అంశాన్ని ముందుకు తెచ్చారని  ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.

ట్రెండ్ ఫాలో కానీ సందీప్ వంగా.. ఏ కారు కొన్నారంటే..

Sandeep Reddy Vanga

సాధారణంగా సినిమా వాళ్లంటే.. వాళ్ల లగ్జరీ లైఫ్ గుర్తొస్తుంది. వాళ్ల నివాసాలు, ధరించే వస్త్రాలు, వాడే కార్లు, బైక్‌లు అందరని ఆకట్టుకుంటాయి. అలాంటి లైఫ్‌స్టైల్ కనీసం ఒక్కసారైనా బతకాలని అందరికీ ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఎంత సక్సెస్ వచ్చిన చాలా సింపుల్‌గా ఉంటారు. అందులో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒకరు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో గ్రాండ్ సక్సెస్ అందులోకి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు సందీప్.

ప్రస్తుతం సందీప్ (Sandeep Reddy Vanga) రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తొలుత ఈ సినిమాలో దీపికా పదుకొనేను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది.

తాజాగా సందీప్ రెడ్డి కొత్త కారు కొన్నారు. అందరిలా కోట్లల్లో కాకుండా.. చాలా తక్కువ బడ్జెట్‌లో ఆయన మినీ కూపర్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారు రిజిస్ట్రేషన్ పూర్తి కాగా.. గురువారం పూజ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర మార్కెట్‌లో రూ.60-70 లక్షలు ఉంటుందని అంచనా.

గంజాయి, మద్యం మత్తులో రోడ్డు మీద యువకుల వీరంగం

Bhimavaram

భీమవరంలోని (Bhimavaram) బొమ్మ కూడలి వద్ద కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మత్తులో ఉన్న యువకులు కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని దుర్భాషలాడారు. అతను బస్సు దిగి వచ్చి ప్రశ్నించగా.. అందరూ కలిసి దాడి చేశారు. అతడు వెళ్తున్న బస్సు వెంబడించి యువకులు వెకిలి చేష్టలు, డ్యాన్సులు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. దీనిపై ఎస్పీ అద్నాన్ నయూం అస్మి మాట్లాడుతూ.. యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు: నాయని రాజేందర్ రెడ్డి

Konda Murali High command

హైదరాబాద్: సీనియర్ నేతగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం అని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. కొండా మురళి వ్యాఖ్యలపై హైకమాండ్ (High command Murali comments) కు ఫిర్యాదు చేస్తాం అని అన్నారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఈ విషయంపై అధిష్టానం ఆలోచన చేయాలని చెప్పారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు అని హెచ్చరించారు. లోకల్ బాడీ ఎన్నికల సమయంలో ఇలా మాట్లాడటం సరికాదని విమర్శించారు. మీ పాపాలు కులాన్ని అడ్డుపెట్టుకుంటే పోతాయా? అని నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ఎవరంటే..

Ind VS Eng

లీడ్స్: భారత్, ఇంగ్లండ్ (Ind VS Eng) మధ్య క్రికెట్ సమరం ప్రారంభమైంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగుతున్న టీం ఇండియాకు (Ind VS Eng) ఈ సిరీస్ ఓ పరీక్ష కానుంది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తున్నట్లు కెప్టెన్ గిల్ తెలిపాడు. అంతేకాక.. సుదీర్ఘ సమయం తర్వాత కురుణ్ నాయర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

తుది జట్లు :
ఇండియా: యశస్వీ జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, కురుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ధ్ కృష్ణ.

ఇంగ్లండ్: జాక్ క్రావ్లే, బెన్ డక్కెట్, ఒల్లే పోప్, జో రూట్, హారీ బ్రూక్, బెన్‌ స్టోక్స్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

ఆ విషయంలో చరిత్ర సృష్టించిన ఐపిఎల్-2025 ఫైనల్

IPL 2025

ఈ ఏడాది జరిగిన zగ్ (IPL 2025) సర్వత్ర ఆసక్తికరంగా సాగింది. దాదాపు అన్ని మ్యాచ్‌లు ఉత్కంఠగా జరిగాయి. సిరీస్ ఆరంభం నుంచి అద్భుతమైన ప్రదర్శన చేసన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని అందుకుంది. అయితే ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ ఫైనల్‌ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ వీక్షణ సమయం 31.7 బిలియన్ నిమిషాలు అని అధికారిక టివి మరియు డిజిటల్ ప్రసారకులు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. టివి, డిజిటల్ వ్యూయర్షిప్‌లో ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం.

టివి వ్యూయర్షిప్‌లో అత్యధిక రీచ్ (169 మిలియన్ వీక్షకులు, 15 బిలియన్ నిమిషాల వీక్షణ సమయం) నమోదు చేసిన టి-20 మ్యాచ్‌గా ఇది ప్రపంచరికార్డు సాధించింది. జియో హాట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్ చరిత్రను తిరగరాసింది. 892 బిలియన్ వీడియో వ్యూస్, 55 మిలియన్ల పీక్ కంకరెన్సీ, 16.74 బిలియన్ నిమషాల వీక్షణ సమయంతో ఈ మ్యాచ్ సరికొత్త రికార్డు సాధించింది. సీజన్ మొత్తం కూడా రికార్డు స్థాయిలో వ్యూయర్షిప్ సాధించింది. కాగా, జూన్ 3వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగి ఐపిఎల్ ఫైనల్స్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుపై 6 పరుగుల తేడాతో ఆర్‌సిబి గెలిచి తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది.

వరంగల్ తూర్పులో మరో నాయకుడికి ఛాన్స్ లేదు: కొండా మురళి

coverts police department

హైదరాబాద్: బయట పార్టీ నుంచి వచ్చిన నేతలు.. పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఎమ్మెల్సీ కొండా మురళి తెలిపారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కోవర్టులు ఉన్నారని అన్నారు. వరంగల్ లో కొండా మురళి సంచలలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళి ఉన్నంతవరకు. వరంగల్ తూర్పులో (East Warangal) మరోనాయకుడికి ఛాన్స్ లేదని అన్నారు.  పరకాలలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడని విమర్శించారు. కనుబొమ్మలు లేని నాయకుడు టిడిపిని భ్రష్టు పట్టించాడని, మొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని అన్నారు. తనకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదని, డిపార్ట్ మెంట్ లో ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కొండా మురళి సూచించారు.

ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ లో మార్పు రాలేదు: పయ్యావుల

Payyavula Keshav comments jagan

అమరావతి: వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి రౌడీ రాజకీయాలు చేస్తున్నారని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.  జగన్ వ్యాఖ్యలకు (Jagan comments) పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. ఓటమి నుంచి తమరు పాఠం నేర్చుకున్నట్లు లేదని అన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ లో మార్పు రాలేదని విమర్శించారు. జగన్ అరాచకాలను సహించేది లేదని, జగన్ హింసను ప్రేరేపిస్తున్నారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పాం: ఉత్తమ్

Concerns people farmers

అమరావతి: కేంద్ర మంత్రికి బనకచర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్టు అని వివరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లపై ఆందోళనలను కేంద్ర మంత్రికి చెప్పామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లపై రాష్ట్ర ప్రజల్లో, రైతుల్లో ఆందోళనలు ఉన్నాయని, తమ ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారని ఉత్తమ్ కుమార్ అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ (Krishna Tribunal) తీర్పు త్వరగా వచ్చేలా చూడమని కోరామని చెప్పారు. ఇచ్చంపల్లి నాగార్జునసాగర్ లింకుతో పెన్నా బేసిన్ కు నీరు తీసుకెళ్ళొచ్చునని, ఇచ్చంపల్లి సాగర్ లింకు అంశంపై చర్చకు సిద్ధమని చెప్పామని తెలియజేశారు. అతిత్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి పాటిల్ చెప్పారని పేర్కొన్నారు. అనేక తెలంగాణ ప్రాజెక్టులు కేంద్రం అనుమతి కోసం చూస్తున్నాయని, తమ ప్రాజెక్టుల కంటే ఎపి ప్రాజెక్టులకే త్వరగా అనుమతులిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.