వీడిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు…

Surveyor Tejeshwar

8 మంది నిందితులు అరెస్టు

కారు, 2-ఎరుకలి కొడవల్లు,1 కత్తి, రూ‌ 1,20,000 రూపాయల నగదు స్వాధీనం

10 మొబైల్ పోన్ లు, జిపిఎస్ ట్రాకర్ స్వాధీనం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసును జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు చేధించారు. తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్ రావు కలిసి తేజేశ్వర్ ను సుఫారీ గ్యాంగ్ తో మర్డర్ చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి‌ రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావుకు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ వివాహేతర సంబంధాలు కొనసాగించాలని తిరుమలరావు కోరాడు. ఎంగేజ్‌ మెంట్‌ అయినప్పటి నుంచి తేజేశ్వర్‌ను చంపేందుకు స్కేచ్‌ వేశారు. తేజేశ్వర్‌ను చంపేస్తే ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని తిరుమల రావు స్కెచ్‌ వేశాడు. తిరుమలరావు, ఐశ్వర్య.. ఎప్పుడూ వీడియోకాల్‌లో ఉండేవారు. చాలాసార్లు తేజేశ్వర్‌పై అటాక్‌ చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ ప్రయత్నించింది. పొలం సర్వే చేయాలని తేజేశ్వర్‌ను తీసుకొని వెళ్లారు. కారులో డ్రైవర్‌ పక్కన కూర్చున్న తేజేశ్వర్ ను చంపారు బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు, ఐశ్వర్య, సుపారీ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశామని వెల్లడించారు.

బాబుతో రేవంత్ సమావేశం… బంకచర్ల పనులు ప్రారంభం: కవిత

MLC kavitha comments Revanth Reddy

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులను మాజీ సిఎం కెసిఆర్ సకాలంలో చెల్లించారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్ర బిరుదు ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..18 నెలల్లోనే రూ. 2 లక్షల కోట్లు రేవంత్ అప్పులు తెచ్చారని, ఆర్ సి సంస్థకు 2024 నుంచి రేవంత్ ప్రభుత్వం కిస్తీలు (Government installments) కట్టడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో రేవంత్ విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. పోలవరంతో భద్రాచలంతో పాటు 5 గ్రామాలకు అన్యాయం జరుగుతున్నా, రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2024జూలై 6న ప్రగతి భవన్ లోఎపి సిఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ తర్వాతనే..బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. గోదావరి- కావేరి లింక్ పేరుతో చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే, రేవంత్ ప్రభుత్వ మొద్దు నిద్రతో అన్యాయం జరుగుతోందని కవిత ధ్వజమెత్తారు.

‘విరాటపాలెం’‌కు ఊహించని షాక్.. ప్రసారం నిలిపివేయాలంటూ..

Viraatapalem

హైదరాబాద్: నటి అభిజ్ఞ, చరణ్ లక్కరాజు నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘విరాటపాలెం’ (Viraatapalem). ‘పిసి మీనా రిపోర్టింగ్’ అనేది క్యాప్షన్. ‘రెక్కీ’ ఫేమ్ పోలూరు కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి జీ5లో ప్రసారం కానుంది. అయితే అంతకు ముందే ఈ సిరీస్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్‌ ప్రసారాన్ని నిలిపివేయాలంటే.. మరో ఒటిటి యాప్ ఈటివి విన్ కోర్టును ఆశ్రయించింది. తన ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న ‘కానిస్టేబుల్ కనకం’ కథతోనే ‘విరాటపాలెం’ సిద్ధమైందని ఈటివి విన్ కోర్టుకు తెలిపింది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో ‘కానిస్టేబుల్ కనకం’ ఈటివి విన్ ఒరిజినల్ సిరీస్‌గా రూపొందుతోంది. మరి ఈ రెండు సిరీస్‌లలో ఏది ముందు విడుదలవుతుందో తెలియాలంటే.. కోర్టు తీర్పు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

డ్యాన్స్ చేసిన జైస్వాల్.. ‘అసలు బుద్ధుందా’ అంటూ ట్రోల్స్

Yashasvi Jaiswal

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు చాలా చోట్ల పొరపాట్లు చేసింది. బ్యాటింగ్‌లో టైయిలెండర్స్ పరుగులు చేయలేకపోవడం, బౌలింగ్‌లో ప్రత్యర్థుల వికెట్లు తీయడంలో ఇబ్బంది పడటం.. మరి ముఖ్యంగా క్యాచులు వదిలేయం వల్ల మ్యాచ్ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచాడు. అందులో ప్రధానంగా బెన్ డక్కెట్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో అతని క్యాచ్‌ను వదిలేశాడు. దీనిపై నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయానికి చేరువవుతున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ (Yashasvi Jaiswal) డ్యాన్ చేస్తూ కనిపించాడు. దీంతో నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ‘నీకు అసలు బుద్ధుందా..? అన్ని క్యాచులు వదిలేసి.. ఇంగ్లండ్ విజయానికి పరోక్షంగా కారణమయ్యావు. అయినా బాధ లేకుండా డ్యాన్స్ చేస్తావా?’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘విరాట్ కోహ్లీని కాపీ కొట్టాలని ట్రై చేస్తున్నావా? నువ్వు ఎప్పటికీ కింగ్ కాలేవు’ అని మరికొందరు అంటున్నారు. ఇంకొదరు అభిమానులు మాత్రం జైస్వాల్‌కు మద్దతు ఇస్తున్నారు. ఒక యువ ఆటగాడిపై అంత ద్వేషం ఎందుకు అని అంటున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆరు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 364 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యం ఇచ్చింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెన్ డక్కెట్ (149) సెంచరీతో, క్రాలీ, రూట్‌లు అర్థశతకాలతో రాణించడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాదించింది.

వాళ్లందరికీ ‘కన్నప్ప’ టీం స్ట్రాంగ్ వార్నింగ్

Kannappa Movie

హైదరాబాద్: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa Movie) మరో రెండు రోజుల్లో (జూన్ 27) విడుదల కానుంది. భారీ తారగణంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. సోమవారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. మొత్తం రన్‌ టైమ్ 3 గంటల 2 నిమిషాలుగా వచ్చింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ కొంతమందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇఛ్చింది. వాళ్లెవరో కాదు క్రిటిక్స్, యూట్యూబర్లు అని తెలుస్తోంది.

కన్నప్ప (Kannappa Movie) సినిమా విడుదల తర్వాత కావాలని సినిమాను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కన్నప్ప మూవీ టీం పెద్ద ప్రెస్ నోట్‌ని విడుదల చేసింది. భారతదేశంలో రాజ్యంగం కల్పించి వాక్‌ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామని చెబుతూనే.. సినిమాను కించపరిచేలా వ్యవహరిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గతంలో టీజర్ విడుదలైనప్పుడు విజువల్స్, విష్ణుపై గట్టిగా ట్రోల్స్ వచ్చాయి. పలువురు యూట్యూబర్లు టీజర్‌పై కామెంట్ చేయగా.. చిత్ర యూనిట్ వారిపై స్ట్రైక్స్ వేసింది. వాటిని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరసన హీరోయిన్‌గా ప్రీతీ ముకుందన్ నటిస్తోంది. ప్రభాస్, మోహన్‌ బాబు, మోహన్‌ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం.మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

టీమిండియా టెయిలెండర్స్‌ ఆట వల్లే మేం గెలిచాం: బెన్ స్టోక్స్

టీమిండియా టెయిలెండర్స్‌ విఫలమవ్వడంతోనే తాము గెలిచామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో జరుగిన తొలి టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గెలపుపై బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ‘టీమిండియా, ఇంగ్లాండ్‌ రెండు జట్లూ నాణ్యమైన క్రికెట్‌ ఆడాయి. హెడింగ్లీ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలించింది. మా బౌలర్లు భారత టెయిలెండర్స్‌ను కట్టడి చేయడం వల్లే మేం ఈ మ్యాచ్‌లో విజయం సాధించగలిగాం. భారత్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేం ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నించాం. పూర్తి ఓవర్లు బ్యాటింగ్‌ చేస్తే చాలు.. మేం గెలుస్తాం అనుకున్నాం’ అని బెన్‌స్టోక్స్‌ పేర్కొన్నాడు.

కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జైస్వాల్, గిల్, పంత్ లు శతకాలతో రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 465కు పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో పంత్, కెఎల్ రాహుల్ లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ 364 పరుగులు చేసింది. అనంతరం 371 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ 82 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుది.

‘ఎవరినీ నిందించడం లేదు’.. భారత్ ఓటమిపై గంభీర్..

Gautam Gambhir

లీడ్స్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీం ఇండియా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత లోవర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు చెత్త ప్రదర్శన చేశారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఈ చెత్త ప్రదర్శనపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. తాజాగా, ఈ విషయంపై మ్యాచ్ అనంతరం గౌతమ గంభీర్ (Gautam Gambhir) మాట్లాడారు. ఈ మ్యాచ్ ఓటమికి ఎవరినీ నిదిండం లేదని ఆయన పేర్కొన్నారు.

అందరం ఒక జట్టుగా ఆడాం.. ఓడాం.. గెలుస్తామని అన్నారు. ‘‘ఈ పరాజయానికి ఏ ఒక్కరిని బాధ్యులు చేయను. కొన్నిసార్లు ఆటగాళ్లు విఫలమవడం సహజం. అందుకు మనకంటే వాళ్లే ఎక్కువ బాధపడతారు. తొలి ఇన్నింగ్స్‌లో 570, 580 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.. టెయిల్ ఎండర్స్ తొలి ఇన్నింగ్స్‌లో రాణించి ఉంటే బాగుండేది’’ అన్నారు. ఏ ఒక్కరి వల్ల మేం మ్యాచ్ ఓడిపోలేదు’ ’ అని గంభీర్ (Gautam Gambhir) పేర్కొన్నారు.

ఇక శార్దూల్ ఠాకూర్‌పై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ.. అతన్ని బౌలింగ్ స్పెషలిస్ట్‌గా జట్టులోకి తీసుకోలేదని.. బౌలింగ్ ఆల్ రౌండర్‌గా అతనికి జట్టులో స్థానం కల్పించామన్నారు. అతను కీలకమైన రెండు వికెట్లు తీసిన విషయాన్ని గుర్తు చేశారు. జడేజా మంచిగా బౌలింగ్ చేస్తున్న నేపథ్యంలో ఠాకూర్‌కి ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం రాలేదని అన్నారు.

శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీ తీసుకున్న తొలి మ్యాచ్‌లోనే జట్టు ఓటమిపాలు కావడంపై స్పందిస్తూ.. ‘‘మొదటి మ్యాచ్‌లో కొంచం టెన్షన్ ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌లో అతను గొప్పగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయడం గొప్ప విషయం. అతను భవిష్యత్తులో కెప్టెన్‌గా రాణించాలంటే.. అతనికి కొంత సమయం ఇవ్వాలి’’ అని స్పష్టం చేశారు.

అంజనా దేవి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు..

Nagababu

హైదరాబాద్: అంజనాదేవి అనారోగ్యం పాలయ్యారనే విషయంపై ఆమె కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ఎంఎల్‌సి నాగబాబు (Nagababu) స్పందించారు. అంజనాదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆమెను చూసేందుకు పవన్‌కళ్యాణ్ మంత్రివర్గ సమావేశం నుంచి చిరంజీవి షూటింగ్‌ని ఆపుకొని హైదరాబాద్ వచ్చారని మంగళవారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఈ వార్తలన్నీ అవాస్తవాలని నాగబాబు (Nagababu) స్పష్టం చేశారు. తమ తల్లి చాలా ఆరోగ్యంగా ఉందని ఆయన సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. కొన్ని అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయని.. కానీ, ఆమె చాలా బాగున్నారంటూ ఆయన పోస్ట్ చేశారు. అయితే అంజనాదేవి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఆమె అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. ఇకసారి చిరంజీవి స్వయంగా ఈ వార్తలను ఖండించారు. అసత్యా ప్రచారాలు నమ్మొద్దని ఆయన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

తప్పు ఒప్పుకున్న పంత్.. శిక్ష విధించిన ఐసిసి

Rishabh Pant

లీడ్స్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించి.. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తాజాగా ఐసిసి పంత్‌‌కు (Rishabh Pant) షాక్ ఇచ్చింది. అంపైర్లతో వాగ్వాదం చేసినందకు అతనికి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. తొలి ఇన్నింగ్స్ 61 ఓవర్‌లో బంతిని మార్చాలని పంత్ ఫీల్డ్ అంపైర్ పాల్ రైఫిల్‌ని అడిగాడు. బంతి కండీషన్ బాలేదని.. ఇంకో బంతి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ, అంపైర్ బంతిని పరిశీలించి దాన్ని మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. దీంతో సహనం కోల్పోయిన పంత్ బంతిని నేలకేసి బలంగా కొట్టాడు.

దీంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌కు ఫిర్యాదు చేశారు. పంత్‌ కూడా తన తప్పును అంగీకరించడంతో పంత్‌కు (Rishabh Pant) ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు ఐసిసి ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. గత 24 నెలల్లో ఇదే తొలి తప్పిదం కావడంతో కేవలం ఒక డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టింది.

కాగా, రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ (137), పంత్ (118) రాణించడంతో భారత్ 364 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 371 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బౌలర్లు నిలకడగా ఆడుతున్నారు. ఐదో రోజు 17 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేశారు. ఇంకా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. ఇంగ్లండ్ 315 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో డక్కెట్ (29), క్రాలీ (21) ఉన్నారు.

జగన్ తప్పును వైసిపి కార్యకర్తలు ఖండించాలి: కలిశెట్టి

Kalisetti Appalanaidu fire jagan

అమరావతి: సిఎం గా పనిచేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు చట్టాలపై గౌరవం లేదు అని ఎపి ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు సిఎం చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగయ్య చనిపోయిన ఘటనలో జరిగిన తప్పుకు జగన్ క్షమాపణ కోరాలి అని సూచించారు. సింగయ్య కుటుంబానికి (Singaya family) అండగా ఉంటాం అని జగన్ చేసే తప్పును వైసిపి కార్యకర్తలు ఖండించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నాయకత్వంలో పని చేస్తున్నారో వారు గుర్తించాలని కలిశెట్టి పేర్కొన్నారు.