నిపుణులు నివేదిక ఇచ్చినా.. రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదు: కెటిఆర్

Manjira Barrage danger

హైదరాబాద్: మంజీరా ఆఫ్రాన్ కొట్టుకు పోయిందని, స్పిల్ వే దెబ్బతిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు చేతకాని తనంతో మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..మార్చి 22 న నిపుణులు మంజీరా బ్యారేజీని (Manjira Barrage) సందర్శించారని, మంజీరా దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని తెలియజేశారు. పిల్లర్లు, ఆఫ్రాన్, స్పిల్ వే పై నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని, నిపుణులు నివేదిక ఇచ్చినా సిఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదని విమర్శించారు. మేడిగడ్డ, మంజీరా బ్యారేజీలను వెంటనే రిపేర్ చేయించాలని చెప్పారు. మంజీరాపై కాంగ్రెస్, బిజెపి నేతలు స్పందించకపోవడం దారుణమని కెటిఆర్ పేర్కొన్నారు.

‘అన్న ఇలా చేస్తాడని అనుకోలేదు’..కన్నప్పపై మనోజ్ రియాక్షన్

Manchu Manoj

హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ చిత్రం ‘కన్నప్ప’. శుక్రవారం (జూన్ 27)న విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాను చూసిన మంచు మనోజ్ (Manchu Manoj) అనూహ్యమైన రియాక్షన్ ఇచ్చారు. సినిమాను ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో చూసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సినిమా బాగుందని చెప్పారు. తాను అనుకున్న దాని కంటే వెయ్యి రేట్లు బాగా వచ్చిందని.. చివరి 20 నిమిషాలు అదిరిపోయాయన్నారు.

ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా మరో రేంజ్‌కి వెళ్లిందని.. ప్రభాస్ యాక్టింగ్ అదిరిపోయిందని మనోజ్ (Manchu Manoj) పేర్కొన్నారు. అన్న (విష్ణు) ఇంత బాగా చేస్తారని అస్సలు ఊహించలేదని తెలిపారు. సినిమా మంచి విజయం సాధించాలని అశిస్తున్నానని అన్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనని భావోద్వేగానికి గురి చేశాయని.. ఇక తన తండ్రి మోహన్‌బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

ఏడాదికి ఎపిఎండిసిపై రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది : జగన్

jagan comments chandra babu naidu

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని వైఎస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనపై మండిపడ్డారు. అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎపిఎమ్ డిసి ద్వారా మళ్లీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారని, రూ.5, 556 కోట్లకు బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారని విమర్శించారు. గతంలోనే హై కోర్టు ప్రభుత్వానికి నోటీసులు (High Court notices government) జారీ చేసిందని, అయినప్పటికీ ఎపిఎండిసి ద్వారా మళ్లీ అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్ బిఐ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నేరుగా.. ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలే.. నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించిందని చెప్పారు. రూ. 9వేల కోట్ల అప్పుల కోసం ఎపిఎండిసికి చెందిన రూ.1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టడం దారుణమని, దీంతో ఎపిఎండిసిపై ఏడాదికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో బాబు చెప్పాలని జగన్ ప్రశ్నించారు.

జూరాలకు వరద ఉద్ధృతి దృష్ట్యా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి: కెటిఆర్

Precautions damage Jurala project

హైదరాబాద్: ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రమాదంలో పడిందని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. జూరాల రోప్ 9వ నంబర్ గేట్ తెగిపోవడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం అని అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయలేదని, మెయింటెనెన్స్ పనులు (Maintenance work) చేయించడంలో నిర్లప్తత స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జూరాలకు వరద ఉద్ధృతి దృష్ట్యా ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని సూచించారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కెటిఆర్ కోరారు.

పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి… కానీ మనకే పసుపు బోర్డు: కిషన్ రెడ్డి

Revanth Reddy proven colluded BRS

హైదరాబాద్: నిజామాబాద్ ప్రజలు గర్వించాల్సిన సమయం ఇది అని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటించారు. పసుపు బోర్డు లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 29న పసుపు బోర్డు ఆఫీస్ (Yellow board office) ను హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని, పలు రాష్ట్రాలు కోరినా కేంద్రం నిజామాబాద్ కే బోర్డు కేటాయించిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐతో విచారణ జరిపించాలని, ట్యాపింగ్ చేసింది పోలీసులే కాబట్టి సిబిఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ తో సిఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. పోలీసులపై పోలీసులే దర్యాప్తు జరిపే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

వీడిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు…

Surveyor Tejeshwar

8 మంది నిందితులు అరెస్టు

కారు, 2-ఎరుకలి కొడవల్లు,1 కత్తి, రూ‌ 1,20,000 రూపాయల నగదు స్వాధీనం

10 మొబైల్ పోన్ లు, జిపిఎస్ ట్రాకర్ స్వాధీనం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసును జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు చేధించారు. తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య, ప్రియుడు తిరుమల్ రావు కలిసి తేజేశ్వర్ ను సుఫారీ గ్యాంగ్ తో మర్డర్ చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో 8మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి‌ రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావుకు ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ వివాహేతర సంబంధాలు కొనసాగించాలని తిరుమలరావు కోరాడు. ఎంగేజ్‌ మెంట్‌ అయినప్పటి నుంచి తేజేశ్వర్‌ను చంపేందుకు స్కేచ్‌ వేశారు. తేజేశ్వర్‌ను చంపేస్తే ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని తిరుమల రావు స్కెచ్‌ వేశాడు. తిరుమలరావు, ఐశ్వర్య.. ఎప్పుడూ వీడియోకాల్‌లో ఉండేవారు. చాలాసార్లు తేజేశ్వర్‌పై అటాక్‌ చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ ప్రయత్నించింది. పొలం సర్వే చేయాలని తేజేశ్వర్‌ను తీసుకొని వెళ్లారు. కారులో డ్రైవర్‌ పక్కన కూర్చున్న తేజేశ్వర్ ను చంపారు బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు, ఐశ్వర్య, సుపారీ గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశామని వెల్లడించారు.

బాబుతో రేవంత్ సమావేశం… బంకచర్ల పనులు ప్రారంభం: కవిత

MLC kavitha comments Revanth Reddy

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులను మాజీ సిఎం కెసిఆర్ సకాలంలో చెల్లించారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్ర బిరుదు ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..18 నెలల్లోనే రూ. 2 లక్షల కోట్లు రేవంత్ అప్పులు తెచ్చారని, ఆర్ సి సంస్థకు 2024 నుంచి రేవంత్ ప్రభుత్వం కిస్తీలు (Government installments) కట్టడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో రేవంత్ విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. పోలవరంతో భద్రాచలంతో పాటు 5 గ్రామాలకు అన్యాయం జరుగుతున్నా, రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2024జూలై 6న ప్రగతి భవన్ లోఎపి సిఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ తర్వాతనే..బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. గోదావరి- కావేరి లింక్ పేరుతో చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే, రేవంత్ ప్రభుత్వ మొద్దు నిద్రతో అన్యాయం జరుగుతోందని కవిత ధ్వజమెత్తారు.

‘విరాటపాలెం’‌కు ఊహించని షాక్.. ప్రసారం నిలిపివేయాలంటూ..

Viraatapalem

హైదరాబాద్: నటి అభిజ్ఞ, చరణ్ లక్కరాజు నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘విరాటపాలెం’ (Viraatapalem). ‘పిసి మీనా రిపోర్టింగ్’ అనేది క్యాప్షన్. ‘రెక్కీ’ ఫేమ్ పోలూరు కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి జీ5లో ప్రసారం కానుంది. అయితే అంతకు ముందే ఈ సిరీస్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్‌ ప్రసారాన్ని నిలిపివేయాలంటే.. మరో ఒటిటి యాప్ ఈటివి విన్ కోర్టును ఆశ్రయించింది. తన ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న ‘కానిస్టేబుల్ కనకం’ కథతోనే ‘విరాటపాలెం’ సిద్ధమైందని ఈటివి విన్ కోర్టుకు తెలిపింది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో ‘కానిస్టేబుల్ కనకం’ ఈటివి విన్ ఒరిజినల్ సిరీస్‌గా రూపొందుతోంది. మరి ఈ రెండు సిరీస్‌లలో ఏది ముందు విడుదలవుతుందో తెలియాలంటే.. కోర్టు తీర్పు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

డ్యాన్స్ చేసిన జైస్వాల్.. ‘అసలు బుద్ధుందా’ అంటూ ట్రోల్స్

Yashasvi Jaiswal

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు చాలా చోట్ల పొరపాట్లు చేసింది. బ్యాటింగ్‌లో టైయిలెండర్స్ పరుగులు చేయలేకపోవడం, బౌలింగ్‌లో ప్రత్యర్థుల వికెట్లు తీయడంలో ఇబ్బంది పడటం.. మరి ముఖ్యంగా క్యాచులు వదిలేయం వల్ల మ్యాచ్ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచాడు. అందులో ప్రధానంగా బెన్ డక్కెట్ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో అతని క్యాచ్‌ను వదిలేశాడు. దీనిపై నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయానికి చేరువవుతున్న సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ (Yashasvi Jaiswal) డ్యాన్ చేస్తూ కనిపించాడు. దీంతో నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ‘నీకు అసలు బుద్ధుందా..? అన్ని క్యాచులు వదిలేసి.. ఇంగ్లండ్ విజయానికి పరోక్షంగా కారణమయ్యావు. అయినా బాధ లేకుండా డ్యాన్స్ చేస్తావా?’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ‘విరాట్ కోహ్లీని కాపీ కొట్టాలని ట్రై చేస్తున్నావా? నువ్వు ఎప్పటికీ కింగ్ కాలేవు’ అని మరికొందరు అంటున్నారు. ఇంకొదరు అభిమానులు మాత్రం జైస్వాల్‌కు మద్దతు ఇస్తున్నారు. ఒక యువ ఆటగాడిపై అంత ద్వేషం ఎందుకు అని అంటున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆరు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 364 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యం ఇచ్చింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెన్ డక్కెట్ (149) సెంచరీతో, క్రాలీ, రూట్‌లు అర్థశతకాలతో రాణించడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాదించింది.

వాళ్లందరికీ ‘కన్నప్ప’ టీం స్ట్రాంగ్ వార్నింగ్

Kannappa Movie

హైదరాబాద్: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa Movie) మరో రెండు రోజుల్లో (జూన్ 27) విడుదల కానుంది. భారీ తారగణంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. సోమవారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. మొత్తం రన్‌ టైమ్ 3 గంటల 2 నిమిషాలుగా వచ్చింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ కొంతమందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇఛ్చింది. వాళ్లెవరో కాదు క్రిటిక్స్, యూట్యూబర్లు అని తెలుస్తోంది.

కన్నప్ప (Kannappa Movie) సినిమా విడుదల తర్వాత కావాలని సినిమాను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కన్నప్ప మూవీ టీం పెద్ద ప్రెస్ నోట్‌ని విడుదల చేసింది. భారతదేశంలో రాజ్యంగం కల్పించి వాక్‌ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామని చెబుతూనే.. సినిమాను కించపరిచేలా వ్యవహరిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గతంలో టీజర్ విడుదలైనప్పుడు విజువల్స్, విష్ణుపై గట్టిగా ట్రోల్స్ వచ్చాయి. పలువురు యూట్యూబర్లు టీజర్‌పై కామెంట్ చేయగా.. చిత్ర యూనిట్ వారిపై స్ట్రైక్స్ వేసింది. వాటిని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరసన హీరోయిన్‌గా ప్రీతీ ముకుందన్ నటిస్తోంది. ప్రభాస్, మోహన్‌ బాబు, మోహన్‌ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం.మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.