ఇంగ్లండ్‌తో ఫలితం ఎలా ఉన్నా.. గిల్‌ను కెప్టెన్‌గా కొనసాగించండి: రవిశాస్త్రి

Ravi Shastri

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శుభ్‌మాన్‌ గిల్‌కి ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓటమిపాలైంది. బ్యాటర్‌గా గిల్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. టీం ఇండియాను మాత్రం గెలిపించలేకపోయాడు. ఈ క్రమంలో గిల్‌ కెప్టెన్సీపై పలువురు విమర్శలు చేశారు. కొందరు మాత్రం అతనికి మద్ధతుగా నిలిచారు. ఆ జాబితాలో టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) కూడా చేరారు. ఇంగ్లండ్‌తో సిరీస్ ఫలితం ఎలా ఉన్నా గిల్‌ని కెప్టెన్‌గా కొనసాగించాలని ఆయన కోరారు.

శుభ్‌మాన్ గిల్‌లో చాలా మార్పులు కనిపిస్తున్నాయని శాస్త్రి (Ravi Shastri) అభిప్రాయపడ్డారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు.. టాస్ వేసే సందర్భంలో ఎంతో పరిణితి ప్రదర్శిస్తున్నాడని కితాబిచ్చారు. ‘‘గిల్‌ను మూడేళ్ల పాటు కెప్టెన్‌గా కొనసాగించాలి. ఇంగ్లండ్ సిరీస్ ఫలితం ఎలా ఉన్నా.. మార్పు చేయవద్దు. అతను కచ్చితంగా టీమ్ ఇండియాను విజయాల బాటలో నడిపిస్తాడు. గొప్ప క్రికెటర్‌కి కావాల్సిన అన్ని లక్షణాలు గిల్‌లో ఉన్నాయి. అతను పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకోగలిగితే గొప్ప ఆటగాడిగా నిలుస్తాడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ జూలై 2వ తేదీ నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం అవుతుంది.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: చంద్రబాబు

three parties coordination

అమరావతి: విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ప్రజలకు చెప్పామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు  (Chandrababu Naidu) తెలిపారు. మూడు పార్టీలు ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో తాము ఏం చేయాలనే దానిపై ఇప్పటికే చర్చించాం అని ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ అఖండ విజయం (huge success) సాధించామని చెప్పారు. ప్రజలు పెట్టిన ఆకాంక్షలను తాము కాపాడుకోవాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం మన బాధ్యత అని తెలియజేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, భవిష్యత్తులో ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

‘అన్నపూర్ణ’ పథకం పేరు మార్చడంపై కెటిఆర్ ఫైర్

Renaming Annapurna canteens

హైదరాబాద్: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రూ.5 భోజనం ‘అన్నపూర్ణ’ పథకం పేరు మార్చడంపై మండిపడ్డారు. ఢిల్లీ బాసులకు విధేయత (Loyalty Delhi bosses) కోసం వాళ్ల పేరును మార్చుకోవచ్చు కదా? అని ఎద్దేవా చేశారు. వాళ్ల పేరును రాజీవ్ లేదా జవహర్ గా ఎందుకు మార్చుకోకూడదు? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ అర్థరహిత చర్యలన్నింటినీ రద్దు చేస్తాం అని కెటిఆర్ పేర్కొన్నారు.

చంద్రబాబు బనకచర్ల అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు: శ్రీకాంత్ రెడ్డి

Srikanth Reddy comments chandra babu

అమరావతి: సంక్షేమాన్ని గాలికొదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి పేరుతో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇప్పటికే లక్షా 60 వేల కోట్లకు పైగా అప్పు తెచ్చారు ఏం చేశారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని, రాయలసీమ ప్రజలను ఊరించడానికే బనకచర్ల ప్రాజెక్టు అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

పాకిస్థాన్‌లో దారుణం.. 16 మంది జవాన్లు మృతి

Suicide Attack

పాకిస్థాన్‌లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో (Suicide Attack) 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ సైనికాధికారులు ప్రకటించారు. ఈ దాడిలో పౌరులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు సహా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్గానిస్థాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో ఉగ్రవాది సైనికుల కాన్వాయ్ పైకి దూసుకెళ్లాడు. దీంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు పిల్లలు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత తీసుకుంటూ ప్రకటన చేసింది.

డబ్ల్యూటిసి చరిత్రలో ఒకేఒక్కడు.. ట్రావిస్ హెడ్ నయా రికార్డు

Travis Head

బార్బడోస్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా బార్బడోస్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త తడబడిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. విండీస్‌ని చిత్తు చేసి 159 పరుగుల భారీ తేడాతో ఈ మ్యాచ్‌ని కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హెడ్ 59, 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

దీంతో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న హెడ్ (Travis Head).. డబ్ల్యూటిసి చరిత్రలో 10 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 50 మ్యాచుల్లోనే ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటిసి ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న హెడ్ మొత్తం 50 మ్యాచుల్లో 3,233 పరుగులు చేశాడు. ఇక డబ్ల్యూటిసిలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో హెడ్ తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్, జో రూట్ ఉన్నారు. వీరిద్దరు చెరి ఐదు సార్లు ఈ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలోనూ ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఉన్నాడు. అతను నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ పుస్తకం కాశీలోని అనేక పార్శ్వాలను సృశించింది: వెంకయ్య నాయుడు

great police officer good book

హైదరాబాద్: పోలీసు అధికారిగా ఉండి మంచి పుస్తకం రాయడం గొప్ప విషయం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. కిల్లాడ సత్యనారాయణ రచించిన పుస్తకం ‘బహుముఖ బనారస్’ ను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా అయోధ్య ఆలయ జ్ఞాపికను సత్యనారాయణ ఆయనకు అందించారు.  వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..ఈ పుస్తకం కాశీలోని అనేక పార్శ్వాలను సృశించిందని అన్నారు. మన సంస్కృతిలో స్త్రీలకు గొప్ప ప్రాధాన్యం ఉంది అని చెప్పారు. యువతలో మార్పు రావాలని, సామాజిక, సాంస్కృతిక (Social cultural) పునర్ వైభవం సాధించాలని సూచించారు. హిందూ అనేది జీవన విధానం అని సంపద, జనాభా, విజ్ఞానం ఉన్న దేశం మనది అని పేర్కొన్నారు. ఇలాంటి పుస్తకాలు వికసిత భారత్ కు తోడ్పడతాయని ఆశిస్తున్నానని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

గజరాజుల బీభత్సం.. జగన్నాథ రథయాత్రలో అపశృతి

Jagannath Rathyatra

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్రలో (Jagannath Rathyatra) అపశృతి చోటు చేసుకుంది. ఊరేగింపుగా వచ్చిన మూడు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగులు అదుపుతప్పి భక్తులపైకి దూసుకు వచ్చాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. అయితే కొంత సమయానికి పరిస్థితి అదుపుకావడంతో మళ్లీ రథయాత్రను యథావిధిగా జరిపించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10.15 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్నాథ రథయాత్ర (Jagannath Rathyatra) అహ్మదాబాద్‌లోని ఖాదియా ప్రాంతం నుంచి వెళ్తుండగా.. ఏనుగులు అదుపు తప్పాయి. దీంతో కొంత సమయం గందరగోళ పరిస్థితి నెలకొంది. భారీ శబ్ధంలు రావడం వల్లే ఏనుగులు బెదిరి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

మంత్రి పదవి రావడం కొందరు తట్టుకోలేకపోతున్నారు: సీతక్క

Sitakka fire BRS

హైదరాబాద్: కొన్ని రాజకీయ పార్టీలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ములుగు మావోయిస్టుల లేఖపై సీతక్క స్పందించారు. లేఖ మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిందా లేదా అంశంపై స్పష్టత లేదని చెప్పారు. తనకు మంత్రి పదవి  రావడాన్ని కొందరు తట్టకోలేకపోతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు చాలా కుట్రలు చేశారని, గిరిజనులను చిత్రహింసలకు (Tribals tortured) గురిచేసిన పార్టీ బిఆర్ఎస్ అని సీతక్క మండిపడ్డారు.

కోల్‌కతాలో మరో దారుణం.. లా విద్యార్థినిపై సమూహిక అత్యాచారం

Kolkata

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో(Kolkata) మరో దారుణం చోటు చేసుకుంది. ఆర్జీకర్ ఆస్పత్రికలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దారుణం మరువక ముందే మరో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కస్బాలోని సౌత్ కోల్‌కతా (Kolkata) లా కళాశాలలో ఈ నెల 25వ తేదీన ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీ రూంలో బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. వారిలో ఇద్దరు సిబ్బంది కాగా, మరొకరు పూర్వ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన మరుసటి రోజు దీనిపై కేసు నమోదు కాగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

పెళ్లికి నిరాకరించిందనే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాల వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయంగా దుమారం రేగింది. మరో ఇద్దరు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20) అని తెలుస్తోంది. నిందితులకు ప్రస్తుతం ఐదు రోజుల కస్టడీ విధించారు. ఈ ఘటనపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీ పాలనలో ఆడవాళ్లకు భద్రత కరువైందని.. పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని బిజెపి నేత అమిత్ మాలవీయా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.