గిల్‌ని ఊరిస్తున్న అనితర సాధ్యమైన రికార్డు.. అదేంటంటే..

Shubman Gill

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ (Shubman Gill) మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన అతను రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును కైవసం చేసుకున్నాడు. ఇలా మరిన్ని రికార్డులను కూడా తిరగరాశాడు గిల్.

అయితే ఇప్పుడు ఓ అరుదైన, అనితర సాధ్యమైన రికార్డు గిల్‌ను (Shubman Gill)) ఊరిస్తోంది. గిల్ ఈ సిరీస్‌లో ఇప్పటికే 585 పరుగులు చేశాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఐదు అంతకంటే తక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో (విదేశాల్లో) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లెజెండ్ డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును గిల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. బ్రాడ్‌మాన్ 1930లో ఇంగ్లండ్ పర్యటనలో 974 పరుగులు చేశారు. 95 ఏళ్లుగా ఈ రికార్డును ఎవరూ చేధించలేకపోయారు. ఆ తర్వాతి స్థానంలో వాలీ హేమాండ్(905 పరుగులు), మూడో స్థానంలో నీల్ హార్వే(834 పరుగులు), నాలుగో స్థానంలో వివ్ రిచర్డ్స్ (829 పరుగులు), ఐదో స్థానంలో క్లైడ్ వాల్కాట్ (827 పరుగులు) ఉన్నారు. గిల్ ఈ సిరీస్‌లో ఈ జాబితాలో స్థానం సంపాదించుకొనే అవకాశం ఉంది.

భారత్‌ తరఫున ఈ రికార్డు సునీల్‌ గవాస్కర్‌ పేరిట ఉంది. గవాస్కర్‌ 1970/71 వెస్టిండీస్‌ పర్యటనలో 4 మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేశాడు. గవాస్కర్‌ తర్వాత ఈ రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. విరాట్‌ 2014/15 ఆస్ట్రేలియా పర్యటనలో 692 పరుగులు చేశాడు. ఈ జాబితాలో గిల్ ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్ ముగిసేలోపు గిల్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

వన్డేల్లో తొలి ఆటగాడిగా.. శ్రీలంక ప్లేయర్ అరుదైన రికార్డు

Wanindu Hasaranga

కొలంబో: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రండో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక స్టార్ ఆటగాడు వనిందు హసరంగా (Wanindu Hasaranga) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమిపాలైనప్పటికీ.. బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో అంతంత మాత్రమ ప్రదర్శన చేశాడు. 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో అతను ఓ రేర్ ఫీట్‌ని తన పేరిట లఖించుకున్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులతో పాటు.. 100 వికెట్లు తీసిన ఆటగాడిగా హసరంగా (Wanindu Hasaranga) నిలిచాడు. 65 మ్యాచుల్లో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ షాన్ పొలాక్ పేరిట ఉండేది. పొలాక్ 68 వన్డేల్లో ఈ రికార్డు సాధించారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసి శ్రీలంక 48.5 ఓవర్లలో 25 232 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1గా సమం చేసింది.

సిగాచి పరిశ్రమ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలి: హరీష్ రావు

Harish Rao comments Congress Govt

హైదరాబాద్: రియాక్టర్ పేలుడులో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేలుడులో ఎంతమంది చనిపోయారో క్లారిటి ఇవ్వాలని అన్నారు. ప్రమాదంపై న్యాయ విచారణ (judicial inquiry) జరపాలని డిమాండ్ చేశారు. పాశమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగే బాంబు పేలుడు ఇది మూడో ఘటన అని హరీష్ రావు పేర్కొన్నారు.

తెలంగాణలోని అంగన్ వాడీలకు కేంద్ర వాటా నిధులు పెంచాలి: సీతక్క

More funds state Allocation

హైదరాబాద్: ఏ రాష్ట్రంలో లేని అంగన్ వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పిస్తాం అని మంత్రి సీతక్క(Sitakka) అన్నారు. కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవితో సమావేశమయ్యారు. శిశు సంక్షేమ శాఖకు మరిన్ని నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలోని అంగన్ వాడీలకు కేంద్ర వాటా నిధులు (Central share funds) పెంచాలని  అన్నపూర్ణ దేవిని సీతక్క కోరారు. సీతక్క వెంట తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్ ఉన్నారు. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న స్కీమ్ లకు రాష్ట్రానికి ఎక్కువ నిధులను కేటాయించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.

రాజాసింగ్ సంచలన నిర్ణయం.. బిజెపికి రాజీనామా.!

Rajasingh

హైదరాబాద్: బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రామచంద్రరావుకు బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడంపై అసంతృప్తి చెందానని ఆయన తెలిపారు. బిజెపి అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి తాను పార్టీ ఆఫీస్‌కు వచ్చానని.. ఆ సమయంలో తన మద్దతుదారులను బెదిరించారని ఆయన ఆరోపించారు. తన రాజీనామా లేఖను కిషన్‌రెడ్డికి అందించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ చేశారని అన్నారు. పార్టీ సింబల్ మీద తాను గెలిచానని.. స్పీకర్‌కు కూడా రాజీనామా లేఖను కిషన్‌రెడ్డినే పంపించాలని ఆయన పేర్కొన్నారు. మీకో దండం, మీ పార్టీకో దండం అని ఆయన అన్నారు.

కొందరు నేతలు వ్యక్తిగత ప్రయోజనాలతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని రాజాసింగ్ (Rajasingh) పేర్కొన్నారు. తాను, తన కుటుంబం టెర్రరిస్టు టార్గెట్‌లో ఉందని తెలిపారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని ఎంతో పోరాడుతున్నామని.. కానీ పార్టీ అధికారంలోకి రావొద్దని కోరుకునే వారే పార్టీలో ఎక్కువ మంది ఉన్నారన్నారు. పార్టీ కోసం ఇంత పని చేసిన మాకు ఏం లాభం అని ప్రశ్నించారు. పార్టీకి రాజీనామా చేశాను కానీ.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

100 కోట్లతో రోడ్డు.. కానీ, మధ్యలో చెట్లను అలాగే వదిలేసి..

Bihar Road

జెహానాబాద్: కొత్తగా నిర్మించిన రోడ్డుపై ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి గుంతలు లేకుండా రోడ్డుకు ఇరువైపుల ప్రకృతిని ఆస్వాదిస్తూ చేసే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, ఆవే చెట్లు రోడ్డు మధ్యలో ఉంటే.. ఆ ప్రయాణం గందరగోళంగా మారుతుంది. బిహార్ రాజధాని పాట్నాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెహానాబాద్‌లో ఇలాంటి రోడ్డునే (Bihar Road) నిర్మించారు. పాట్నా నుంచి గయాకు వెళ్లే మార్గంలో 100 కోట్లతో 7.48 కిలోమీటర్ల మేర జరిగిన రోడ్డు నిర్మాణంలో చెట్లను అలాగే వదిలేశారు.

అసలు కారణం ఏంటంటే.. జిల్లా యంత్రాంగం ఈ రోడ్డు (Bihar Road) నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. అయితే చెట్లను తొలగించడానికి అటవీ శాఖను వాళ్లు సంప్రదించారు. కానీ అటవీ శాఖ అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ చెట్లు తొలగిస్తే.. 14 హెక్టార్ల భూమిని పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఆ డిమాండ్‌ను పూర్తి చేయలేకపోయిన అధికారులు ఈ విచిత్రమైన పనికి పూనుకున్నారు. రోడ్డుపై ఉన్న చెట్లు ఒక వరుసలో ఉన్నా బాగుండేది.. కానీ, అవి గజిబిజిగా ఉన్నాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడంగా మారింది. ఇప్పటికే ఈ రోడ్డులో పలు ప్రమాదాలు జరిగాయని ఓ వ్యక్తి తెలిపారు. అయితే ఈ రోడ్డును పునరుద్దరించకపోతే పెను ప్రమాదం జరిగి ఎవరి ప్రాణాలైనా పోతే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆధారాలు లేకుండా రాస్తే చర్యలు కఠినంగా ఉంటాయి: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy comments Revanth Reddy

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఏం సంబంధం? అని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. పథకం ప్రకారం కెసిఆర్ కుటుంబంపై కక్షసాధింపు జరుగుతోందని అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏ విచారణ అధికారైనా కెసిఆర్, కెటిఆర్ పేరు చెప్పారా? అని ఫోన్ ట్యాప్ (Phone tap) చేశారని ఏ అమ్మాయైనా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ఊహించి రాసి ఇదే జర్నలిజం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా రాస్తే తమ చర్యలు కఠినంగా ఉంటాయని, దుష్ప్రచారంపై కెసిఆర్ ఊరుకున్నా తాము ఊరుకోం? అని ధ్వజమెత్తారు. దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరగడం లేదా? అని ఇప్పుడు ట్యాపింగ్ జరగట్లేదని సిఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా? అని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

‘బిగ్‌బాస్’ అభిమానులకు గుడ్‌న్యూస్.. మీరు కూడా పాల్గొనవచ్చు

Bigg Boss 9

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9) త్వరలో ప్రారంభంకానుంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. ‘చదరంగం కాదు.. ఈసారి రణరంగం’ అంటూ ఈ 9వ సీజన్‌ని నాగార్జన పరిచయం చేశారు. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు పాల్గొనే అవకాశం కల్పించారు. ‘‘ఇప్పటివరకూ బిగ్‌బస్ షోను మీరు ఎంతగానో ప్రేమించారు. ఇంత ప్రేమ ఇచ్చిన మీకు రిటర్న్ గిఫ్ట్ ఏమివ్వాలి? సెలబ్రిటీలే కాదు. మీకు అవకాశం ఉంది. వచ్చేయండి.. బిగ్‌బాస్9 తలుపులు మీకోసం తెరిచి ఉంటాయి’’ అని నాగార్జను పేర్కొన్నారు. బిగ్‌బాస్ 9లో పాల్గొనాలంటే bb9.jiostar.com వెబ్‌సైట్‌కి వెళ్లి.. రిజిస్టర్ అయి.. ఆ షోటో మీరు పాల్గొనడానికి గల కారణాన్ని తెలుపుతూ ఓ వీడియోని అప్‌లోడ్ చేయాలి. మీ వీడియో నచ్చితే బిగ్‌బాస్‌లోకి వెళ్లే అవకాశం మీకు లభిస్తుంది.

విద్యావ్యస్థలో దారుణ పరిస్థితులకు ఇది మరో నిదర్శనం: జగన్

jagan comments Nara Lokesh

అమరావతి: ఎపిలో విద్యావ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan MohanReddy మండిపడ్డారు. విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి..ఎపి ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నాఇప్పటికి కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని విమర్శించారు. రేపటి నుంచి..బిటెక్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు.

ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు (Polytechnic students)ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు. మే 15న ఫలితాలు వచ్చినా, ఇప్పటికి కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ లేదని, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదని అన్నారు. విద్యావ్యస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం అని ఎద్దేవా చేశారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అని జగన్ దుయ్యబట్టారు.

పసుపుబోర్డు సాధించిన నిజామాబాద్ రైతులు: బండి సంజయ్

Nizamabad achieved yellow board

హైదరాబాద్: ఎంతో పోరాటం చేసి నిజామాబాద్ పసుపుబోర్డు సాధించిందని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. పసుపుబోర్డు (yellow board) సాధించిన నిజామాబాద్ రైతులకు అభినందనలు తెలియజేశారు. పసుపుబోర్డు ఇచ్చిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, బిజెపికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.