వ్యవసాయం, రైతుల పట్ల తప్పుడు రాతలు రాయిస్తారా? : జగన్

jagan fire chandrababu naidu

అమరావతి: ఎపి సిఎం చంద్ర బాబు నాయుడుకు కొమ్ము కాస్తూ ఎల్లో మీడియా మరింత దిగజారిపోయిందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. బంగారుపాళ్యానికి వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చారని అన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ తీరుపై రైతుల్లో ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసిందని, రైతులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరించడం తమకే చెల్లిందని విమర్శించారు. వ్యవసాయం, రైతుల పట్ల తప్పుడు రాతలు రాయిస్తారా? అని నిలదీశారు. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా రాశారని, ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. పాలకుడని చెప్పుకోవడానికి, పత్రికలు అని చెప్పుకోవడానికి తమ ఎల్లో మీడియాకు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు.

పండిన పంటను కొనేవాడు లేక రైతులు పారబోస్తున్నారని, ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమేనని చెప్పారు. 2.2 లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట.. 76 వేల రైతు కుటుంబాల సమస్య ఇది అని రైతులు తమ కంటికి దొంగలు, రౌడీలు మాదిరిగా కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు. రైతులు కష్టాల్లో లేకుంటే మామిడికి రూ. 4 ఎందుకు ప్రకటించారని, మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? అని జగన్ ధ్వజమెత్తారు. తమ హయాంలో కిలో మామిడిని రూ. 25-29 కి కొనుగోలు చేశారని, మేలో తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను ఆలస్యంగా ఎందుకు తెరిచారని అన్నారు. తమ వాళ్లకు మేలు చేసే ఉద్దేశంతోనే ఇదంతా చేశారా? అని తమర్ని నిలదీస్తే తప్పుడు రాతలు రాయిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ కనీస మద్దతు ధర లేదని, తమ హయాంలో రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరకరణ నిధి పెట్టి..రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు.

రైతులు నష్టపోతున్నా తమరెందుకు ఆ పని చేయడం లేదు? అని ఏ పంటకు ఏ ధర ఉందనే సిఎమ్ యాప్ ఏమైందీ? అని ప్రశ్నించారు. గతేడాది తమరు ఇస్తానన్న రైతు భరోసా రూ. 20 వేలు ఇవ్వలేదని, ఈ ఏడాది కూడా దాని గురించిన ప్రస్తావన లేదని తమ హయాంలో మే చివరికల్లా పెట్టుబడి సాయం ఇచ్చేవాళ్లమని, ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సీడీని అటకెక్కించారని చురకలంటించారు. ఇ- క్రాప్ విధానాన్ని, ఆర్ బికెలను నిర్వీర్యం చేశారని, టెస్టింగ్ ల్యాబ్ లను సైతం నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారని, ప్రశ్నించిన తమపైన, రైతులపైన అవాకులు, చవాకులు పేలుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబూ అని జగన్ హెచ్చరించారు.

మగ, ఆడ బిడ్డలను సమానంగా చూడాలి: చంద్రబాబు

School place worship

అమరావతి: మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని ఇచ్చే పుణ్యక్షేత్రం పాఠశాల అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. పాఠశాలలు పవిత్ర దేవాలయాలు అని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పి పాఠశాలలో మెగా పిటిఎం 2.0 కార్యక్రమం నిర్వహించారు. పేరెంట్స్, టీచర్ల మెగా సమావేశంలో సిఎం పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సూచనలిచ్చారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..తాను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం కొత్త చెరువులో ప్రజలు ఇచ్చారని, పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నానని తెలియజేశారు. చదువుకుని పైకి వచ్చినవారు స్కూళ్లకు ఎంతోకొంత చేయూత ఇవ్వాలని సూచించారు. విద్యావ్యవస్థను అద్భుతంగా నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ కు అభినందనలు చెప్పారు.

ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్లను మరచిపోలేమని, తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుది అని అన్నారు. పనుల్లో పడి పిల్లల్ని మర్చిపోతున్నామని, లోకేష్ చదువుకునే రోజుల్లో ఎప్పుడూ పేరెంట్స్ మీటింగ్ కు వెళ్లలేకపోయానని గుర్తుచేశారు. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం (Parents share) కావాలని, తాను మహిళా పక్షపాతినని ఏ పని చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని పేర్కొన్నారు. ఆడపిల్లలను చదివిస్తే ఏం వస్తుందని ఆనాడు అనుకునేవారని, మగపిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదని అన్నారు. మగ, ఆడ బిడ్డలను సమానంగా చూసుకోవాలని, అందుకే ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు. మీ పిల్లల చదువు బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

గిల్ కు సహజంగానే ఆ నైపుణ్యాలు ఉన్నాయి: అశ్విన్

Shubman gill good handle media

హైదరాబాద్: రెండో టెస్టులో టీమిండియా గెలిచి సిరీస్‌ను సమం చేసింది. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ డబుల సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. కెప్టెన్ అయిన తరువాత మీడియాతో ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది. గిల్ మీడియాతో వ్యవహరిస్తున్న తీరు ఎంతో ఆకట్టుకుటుంది. 25 ఏళ్ల కుర్రాడు ఎంతో పరిణతి చెందిన వ్యక్తిగా మాట్లాడుతుండడంతో గిల్‌ను భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించారు.

టీమిండియా విదేశాలకు వెళ్లినప్పుడు కెప్టెన్‌ను మీడియా టార్గెట్ చేస్తుందని అశ్విన్ తెలిపారు. పర్యటక జట్టును ఇబ్బందుల్లో పడేస్తే ఆటోమేటిక్‌గా ఆధిపత్యం సాధించవచ్చని లోకల్ మీడియా ఆలోచన చేస్తుందని చెప్పారు. గిల్ మాత్రం మీడియా విషయంలో సహజ సిద్ధంగానే వ్యవహరించాడని కొనియాడరు. ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా షో చేస్తున్నట్లు కనిపించలేదని మెచ్చుకున్నారు. పాతికేళ్లకే ఎలాంటి ప్రశ్నలకైనా ఇబ్బందిలేకుండా తెలికగా జవాబు చెబుతుండడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ప్లేయర్లకు మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో ముందే చెబుతున్నారని, గిల్ మాత్ర సహజంగానే నైపుణ్యాలను అందిపుచ్చుకున్నాడని ప్రశంసించారు.

నా తొలి ప్రేమ ఆయనతోనే: అనుష్క

Anushka shetty love story

టాలీవుడ్‌లో పలు సినిమాలలో నటించి అనుష్క శెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. సూపర్ సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు. బాహుబలి, విక్రమార్కుడు, లక్షం, సౌర్యం, చింతకాయల రవి, అరుంధతి వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు పొందారు. బాహుబలి సినిమాతో ఆమె పేరు నటిగా మార్మోగిపోయింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల పక్కన నటించి మెప్పించారు. ఆమెకు ఫిల్మ్ పేర్, నంది అవార్డులు వరించాయి. ఆమెకు ప్రస్తుతం 43 ఏళ్లు ఉన్న ఇంకా పెళ్లి చేసుకోలేదు. అభిమానులు పలుమార్లు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని ప్రశ్నిస్తున్నారు.

ఓ ఇంటర్వ్యూలో తన తొలి ప్రేమ గురించి నోరు విప్పి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తారు. తాను ఆరో తరగతి చదువుతున్నప్పుడు క్లాస్‌మెట్ ఆమెకు ఐ లవ్ యు చెప్పాడు. ఆ పదానికి అర్థం తెలియకపోయినా ఓకే చెప్పేశానని వివరణ ఇచ్చింది. అది చిన్న విషయం అయినప్పటికి ఇప్పటికీ మధుర జ్ఞాపకంగా ఉందని అనుష్క గుర్తు చేసుకున్నారు. అనుష్కలో అమాయకత్వం ఇప్పటికీ అలాగే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అనుష్క నటిస్తున్న ‘ఘాటి’ సినిమాకు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి వంశీకృష్ణారెడ్డి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు : లోకేష్

Mega meeting parents teachers

అమరావతి: మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులేనని ఎపి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. ప్రతి విజయం వెనుక గురువు ఉంటారని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పి పాఠశాలలో మెగా పిటిఎం 2.0 కార్యక్రమం నిర్వహించారు. పేరెంట్స్, టీచర్ల మెగా సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతోందని చెప్పారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు (Student progress cards) చంద్రబాబు నాయుడు, లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. మనకు నడక, బాధ్యత నేర్పేది అమ్మ అని తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం పథకం  అమలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో నాణ్యత లేని యూనిఫామ్ లు ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని  పేర్కొన్నారు.

షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశామని, పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటాలని ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారని అన్నారు. పవన్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని, విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం అని సూచించారు. పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ కష్టపడి గెలుద్దాం అని మన తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వాలని చెప్పారు. తాను విద్యాశాఖను తీసుకుంటే చాలా మంది ఫోన్ చేశారని, కష్టమైన విద్యాశాఖ ఎందుకు అవసరమా? అన్నారని, కష్టపడడమంటే తనకు ఇష్టం అని చెప్పానని నారా లోకేష్ స్పష్టం చేశారు.

‘హరిహర వీరమల్లు’ నుంచి ‘ఎవరది ఎవరది’ పాట విడుదల

Hari Hara Veera Mallu

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాటలతో పాటు రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌ వరకూ ప్రతీది ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎవరది ఎవరది’ పాటను విడుదల చేశారు. ‘ఎవరది ఎవరది.. అతగాడో పొడుపు కథ.. దొరకనే దొరకడు అతగాడో మెరుపు కథ’ అంటూ సాగే ఈ పాట పవన్‌ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. చిత్రం కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా.. మిగితా భాగం నిర్మాత ఎఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి భాగం ‘హరిహర వీరమల్లు – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hari Hara Veera Mallu) జూలై 24వ తేదీన విడుదల కానుంది.

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. ఒకరు మృతి

Fighter Jet

రతన్‌ఘర్: రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌ఘర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్ విమానం (Fighter Jet) కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఆకాశంలో ఉండగానే విమానం నియంత్రణ కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. విమానం కూలిన పొలాల్లో కూలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేశామని చెప్పారు. కూలిన విమానం నుంచి ఒకరి మృతదేహాన్ని బయటక తీశామని స్థానికులు పేర్కొన్నారు. అయితే భారత వాయుసేన మాత్రం ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలైనట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనస్థలానికి చేరుకొని ఘటన ఎలా జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు.

మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: జగన్

Jagan comments chandrababu naidu

అమరావతి: ఎపి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సిఎం వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. మామిడి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరులోని బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ఇక్కడికి వచ్చానని అన్నారు. కూటమి పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని, ప్రభుత్వమే రైతులపై కుట్రలు చేయడం దారుణం అని మండిపడ్డారు. రైతులను రాకుండా చేసేందుకు పోలీసులు మోహరించారని, రైతులను కలవకుండా ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.

అయినా వేలమంది రైతులు వచ్చి వారి ఆవేదన చెప్పుకున్నారని అన్నారు. రైతులను రౌడీషీటర్లతో పోలుస్తారా? అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు (crop profitable state) ధర లేదని, కిలో మామిడి 2 రూపాయలా? ఇదేం దారుణం అని ఆశ్చర్యపోయారు. తమ హయాంలో రూ.22 నుంచి రూ. 29కి కొన్నామని, కర్ణాటకలో కిలో మామిడిని రూ.16 కి కేంద్రం కొంటుంటే…రాష్ట్రంలో  సిఎం చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నారా? అని లక్షల మెట్రిక్ టన్నుల్లో మామిడి ఉందని బాబుకు తెలియదా? అని ఎద్దేవా చేశారు. మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సూచించారు.

వెంటనే 76 వేల మంది రైతుల పంట కొనుగోలు చేయాలని, ప్రతి రైతుకు వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల పక్షాన నిలబడి తానే ముందుండి పోరాడతానని తెలియజేశారు. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా? అని రైతుల తలలు పగలకొడతారా? 1200 మందిని జైల్లో పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రలోభాలు, లంచాలకు పోలీసులు లొంగొద్దు అని రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేస్తారని హితవు పలికారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే.. ఇది గుర్తు పెట్టుకోండి అని జగన్ సవాల్ విసిరారు.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన గిల్.. ఏ స్థానంలో నిలిచాడంటే..

ICC Test Rankings

ఐసిసి తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను (ICC Test Rankings) ప్రకటించింది. ఈసారి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా భారత టెస్ట్ కెప్టె‌న్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మాన్ గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, రెండో టెస్ట్‌ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన గిల్ 15 స్థానాలు మెరుగుపరుచుకొని.. తాజా ర్యాంకింగ్స్‌లో 807 పాయింట్లతో ఆరో స్థానంలో స్థిరపడ్డాడు. గిల్‌తో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానం, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

ఇక తాజా ర్యాంకింగ్స్‌లో (ICC Test Rankings) ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు. రెండో టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన బ్రూక్ జో రూట్‌ను 886 పాయింట్లతో వెనక్కి నెట్టి ప్రపంచ నెం.1 టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక రెండో టెస్ట్‌లో బ్రూక్‌తో పాటు అద్భుత ప్రదర్శన చేసిన జేమీ స్మిత్ 753 పాయింట్లో పదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. 898 పాయింట్లతో జస్ప్రీత్ బుమ్రా నెం.1 ర్యాంకులో ఉండగా.. సఫారీ బౌలర్ కగిసో రబాడా 851 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా ప్రజాపాలన నడుస్తోంది: వివేక్ వెంకటస్వామి

Democratic governance running

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మంత్రులతో ప్రజలు నేరుగా కలిసి సమస్య చెప్పుకునే అవకాశం ఉండటం చాలా బాగుందని మంత్రి  జి.వివేక్ వెంకటస్వామి (G.Vivek Venkataswamy) తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా ప్రజాపాలన నడుస్తోందని అన్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ..మంత్రులతో ముఖాముఖి చాలా మంచి కార్యక్రమం అని తెలియజేశారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా ప్రజాస్వామ్య పాలన నడుస్తోందని, జిల్లాల్లో కూడా కలెక్టర్లు ప్రజాపాలనను సమర్థవంతంగా (Effective public administration) నిర్వహిస్తున్నారని, గ్యారంటీల అమలును పరిశీలించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.