తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

Heavy Rains Monsoon

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల (Monsoon) కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న కారణంగా రాష్ట్రంలో ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణలో భారీ వర్షాలతో పాటు 40 కి.మీ. నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండతో పాటు వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య పునాదులను నిలబెట్టింది: భూమన

Supreme Court verdict

అమరావతి: కూటమి ప్రభుత్వం ప్లాన్ ప్రకారం సాక్షి మీడియాపై దాడులు చేయించారని ఎపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు.. ప్రజాస్వామ్య పునాదులను నిలబెట్టిందని పేర్కొన్నారు. సాక్షి ఆఫీసులపై దాడి చేసిన గూండాలను అరెస్ట్ చేయాలని భూమన కరణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.