వెంటనే టెహ్రాన్ నుంచి వచ్చేయండి.. భారతీయులకు హెచ్చరిక

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వైమానిక దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు పరస్పరం క్షిపణులతో భీకర దాడులకు దిగడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఇరుదేశాల మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో అన్ని ఎయిర్ పోర్టులు మూసివేశారు. మరోవైపు, జీ-7 సమావేశం నుంచి డోనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా అమెరికా వెళ్లిపోయారు. దీంతో ఇరాన్ లో ఏక్షణమైనా ఏదైనా జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు ఇరాన్ గగనతలంపై ఆంక్షలు విధించింది. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను వదిలి స్వదేశానికి రావాలని భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో టెహ్రాన్ నుంచి అప్ఘనిస్తాన్ మీదుగా భారతీయులు.. ఇండియాకు చేరుకుంటున్నారు. కాగా, ఈ దాడుల్లో ఇరుదేశాల్లో దాదాపు 300కు పైగా మంది మృతి చెందగా.. వందల మంది గాయాలపాలయ్యారు.

కమల్‌హాసన్‌కి సుప్రీం కోర్టులో భారీ ఊరట.. అందుకు లైన్ క్లియర్

Kamal Hassan Thug Life

న్యూఢిల్లీ: కమల్‌హాసన్ (Kamal Hassan), మణిరత్నం కాంబినేషన్‌లో రీసెంట్‌గా వచ్చిన చిత్రం ‘థగ్‌ లైఫ్’ (Thug Life). జూన్ 5న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా (Thug Life) విడుదలకు ముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఈవెంట్‌లో కమల్ (Kamal Hassan) చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కన్నడ ప్రజలు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కానీ, కమల్ అందుకు నిరాకరించారు. ఈ క్రమంలో ఈ సినిమా కర్ణాటకలో విడుదల చేయలేదు.

అయితే ఇఫ్పుడు కమల్‌హాసన్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ‘థగ్ లైఫ్’ సినిమాని కర్ణాటకలో విడుదల చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం హెచ్చరించింది. థియేటర్స్‌లో ఏమి ప్రదర్శించాలనే అధికారం గుంపులకు, అచారక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్ట పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. అలాగే కమల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టే హక్కు కన్నడ ప్రజలకు ఉందని.. ప్రాథమిక హక్కులను కాపాడాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కమల్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని నమ్మితే ఒక ప్రకటన ఇస్తే చాలని.. అంతేకానీ, థియేటర్లు తగలబెడతామని ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించింది.

 

ఈ ఏడాదిలో జాన్వీ పెళ్లి.. లేకుంటే అప్పటివరకూ ఆగాల్సిందే..?

Janhvi Kapoor

అతిలోక సుందరీ శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కాపూర్ (Janhvi Kapoor) ఆ తర్వాత తనకంటే గుర్తింపును సంపాదించుకుంది. బాలీవుడ్‌ మంచి సక్సెస్ సాధించిన జాన్వీ తెలుగులో ‘దేవర’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఓ జ్యోతిష్యుడు జాన్వీ వివాహం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ఆమెకు ఈ ఏడాది వివాహం జరుగుతుందని పేర్కొన్నారు.

సిద్ధార్థ్ కన్నన్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన జ్యోతిష్యుడు సుశీల్ కుమార్.. 2026 కల్లా జాన్వీ (Janhvi Kapoor) కెరీర్‌ పరంగా మంచి పొజిషన్‌కు వెళ్తుందని తెలిపారు. ఇకపోతే.. ఈ ఏడాది జాన్వీ వివాహం జరుగుతుందని.. లేని పక్షంలో ఆమెకు 33 సంవత్సరాలు వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే అని కామెంట్ చేశారు. ఓ వైపు ఆమె వైవాహిక జీవితం బాగుంటుదని చెబుతూనే.. గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం సుశీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలడుతున్నారు: రోజా

Super Six implementing

అమరావతి: అమలు చేయకుండానే సూపర్ సిక్స్  పథకాలు చేసేశామని చెప్తున్నారని ఎపి మాజీ మంత్రి ఆర్ కె రోజా తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలడుతున్నారని అన్నారు. రోజా చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు ఏమైంది? అని ఉచిత బస్సు ఎక్కడా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి లేనే లేదని, గతంలో స్కూల్ మెయింటినెన్స్ రూ. వెయ్యి తీసుకుంటే..ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేలు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రీయ విద్యార్థులకు (Central students) తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. కూటమి మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం అని రోజా పేర్కొన్నారు.

బిఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్..రోజుకు 2జీబీ డేటా, 80 రోజుల వ్యాలిడిటీ..

Private telecom companies hike mobile recharge price

ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడటానికి ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఒకదాని తర్వాత ఒకటి చౌకైన, ఎక్కువ ప్రయోజనాలతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కంపెనీ ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో కాలింగ్, డేటా ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా దాదాపు 80 రోజుల దీర్ఘకాల చెల్లుబాటుతో వస్తుంది. ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ గురించి పూర్తిగా చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ కంపెనీ రూ. 485 ప్లాన్‌ను తీసుకొచ్చింది.ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అంటే రోజంతా కావలసినంత మాట్లాడవచ్చు. దీనితో పాటు బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ 100 ఉచిత SMSలను కూడా అందిస్తోంది. అంటే.. డేటా, కాలింగ్‌తో పాటు సాధారణ SMSలను కూడా పంపవచ్చు.

ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి, రీఛార్జ్ ప్లాన్ చేసుకోవడానికి బడ్జెట్ దాదాపు రూ. 500 మాత్రమే ఉంటె ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక కావచ్చు. ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్‌లో ఈ ప్రయోజనాలన్నింటినీ కోరుకుంటే కనీసం రూ. 600 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

34 మెడికల్ కాలేజీల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలి: రేవంత్ రెడ్డి

Construction facilities colleges

హైదరాబాద్: అన్ని కాలేజీల్లో మూడేళ్లలోగా వసతుల నిర్మాణం పూర్తవ్వాలని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీ, సిబ్బంది ప్రమోషన్లపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 34 మెడికల్ కాలేజీల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలంటూ ప్రతి కాలేజీని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్రణాళిక‌ (Action plan) ను వెంట‌నే త‌యారు చేయాల‌ని అధికారులకు ఆదేశించారు. అవసరాలు, నిధుల వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. అనుబంధ ఆస్పత్రుల్లో పరికరాలు, పడకలు పెంచాలని అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతులకు తాను చొరవ తీసుకుంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

జైలుకు పోవాలని కెటిఆర్‌కు కుతూహలంగా ఉంది: సీతక్క

KTR Seethakka

హైదరాబాద్: ఫార్ములా-ఈ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) సోమవారం ఎసిబి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాను విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రి సీతక్క(Seethakka) కెటిఆర్‌పై విమర్శులు గుప్పించారు. కెటిఆర్‌కు జైలు పోవాలని కుతూహలంగా ఉందని సెటైర్లు వేశారు. కెటిఆర్ అందుకే సిఎంను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. కెటిఆర్‌, కవితకు మధ్య పోటీ నెలకొందని అన్నారు. కవిత జైలుకు పోయివచ్చి బిపి ఎజెండా ఎత్తుకుందని.. ఇప్పుడు కెటిఆర్ కూడా జైలుకు వెళ్లి కొత్త వ్యూహాలు రచించే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ఏదో ఆశించే కెటిఆర్ జైలుకు వెళ్తా అని అంటున్నారని విమర్శించారు.

ఎపి ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సంక్షేమం ఆపలేదు: నిమ్మల

Annadaata sukhibhava performed

అమరావతి: ఒకే నెలలో రెండు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ (Annadata sukhibhava) అమలు చేస్తామని అన్నారు. ఎపి ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సంక్షేమం ఆపలేదని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం అమలవుతుందని చెప్పారు. వైసిపి ఐదేళ్ల హయంలో 90 శాతం హామీలు నెరవేర్చలేదని, ‘తల్లికి వందనం’ పై వైసిపి నేతలకు మాట్లాడే అర్హత లేదని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

పాల‌కూర మంచిదే.. కానీ అధికంగా తింటే..?

మన ఆరోగ్యం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల కాలంలో చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి ఆహారాలపై అనేక ఖర్చులు చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటాము. కూరగాయలలో భాగంగా పాలకూరను ఆహారంలో చేర్చుకుంటాము.

పాలకూర ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైంది. దీనికి కారణం ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడతాయి. అందుకే పాలకూరను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. అయితే అధికంగా పాలకూరని తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో హానికరం కావచ్చు. అధికంగా పాలకుర తీసుకుంటే వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పాలకూరను అధికంగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాలకూరలో ఆక్సలేట్ స్థాయి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియంతో కలిసి రాలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందే కిడ్నీ స్టోన్స్ సమస్య ఉంటే వీటికి దూరంగా ఉండటమే మంచిది.

పాలకూరను అధికంగా తీసుకుంటే ఇందులో ఉండే ఆక్సలేట్, ఐరన్, కాల్షియం, జింక్ వంటివి శోషణ కు అడ్డుపడుతాయి. దీంతో శరీరంలో అవసరమైన పోషకాల కొరత కూడా ఏర్పడవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా బరువుగా అనిపించవచ్చు.

పాలకూరలో ఉండే కొన్ని పదార్థాల వల్ల అలర్జీలు రావచ్చు. దీనివల్ల చర్మంపై దురద, దద్దుర్లు, రాషెస్ రావచ్చు. ఒకవేళ పాలకూర తిన్న తర్వాత చర్మంపై ఏదైనా ప్రతిస్పందన కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. థైరాయిడ్ సంబంధిత సమస్యలు ఉన్నవారు పాలకూర తినకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే గాయిట్రోజన్ థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా హైపోథైరాయిడిజం ఉన్నవారు పాలకూరను తక్కువగా తీసుకోవాలి.

అక్కరకు రాని పదవులే బిసిలకు ఇస్తున్నారు : శ్రీనివాస్ గౌడ్

elections conducted reservation

హైదరాబాద్: రిజర్వేషన్ల పై బిసిలను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని ప్రకటించడం బిసిలకు చేస్తున్న అన్యాయమని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్ (BC Reservation) బిల్ పై ప్రధాని నరేంద్ర మోడీతో ఎందుకు మాట్లాడలేదని, బిసిలకు రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అక్కరకు రాని పదవులే బిసిలకు ఇస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.