తొలి టెస్ట్‌కి ముందు కోహ్లీపై బెన్‌ స్టోక్స్ ఆసక్తికర కామెంట్స్

Ben Stokes Virat Kohli

భారత్, ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకో రెండు రోజులే (శుక్రవారం నుంచి ప్రారంభం) ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ సారథ్యంలో భారత్ జట్టు ఈ సిరీస్‌లో ఎలా ఆడనుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ లేకుంటే మ్యాచ్‌లో మజా ఉండదు అని కామెంట్ చేశాడు.

టీమిండియా కోహ్లీ సేవలను కచ్చితంగా మిస్ అవుతుందన్న స్టోక్స్ .. అతని పోరాటపటిమ, పట్టుదలకు ఎవరూ సాటిరారని అన్నాడు. 18వ నెంబర్‌ను కోహ్లీ తన గుర్తింపుగా మార్చుకున్నాడని.. వేరే ఆటగాడిపై ఆ నెంబర్‌ చూడటం విచిత్రంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. కోహ్లీ లేని టెస్ట్ క్రికెట్ అంత గొప్పగా ఉండదని.. కోహ్లీ ప్రత్యర్థిగా ఆడటంలో మజా ఉంటుందని తెలిపాడు. మైదానంలో ఉన్నప్పుడు తాను, కోహ్లీ దాన్ని యుద్ధరంగంగా భావిస్తామని.. ఆట విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాని.. కోహ్లీ ఒక క్లాస్ ప్లేయర్ అని ప్రశంసలు కురిపించాడు.

సోదరుడి అంత్యక్రియల్లో విమాన ప్రమాద బాధితుడు.. (ఎమోషనల్‌ వీడియో)

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ బుధవారం తన సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో రమేష్ స్వల్ప గాయాలతో బయటపడగా..అతని సోదరుడు అజయ్ మృతి చెందాడు. చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రమేష్.. ఈరోజు సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అజయ్ మృతదేహాన్ని భుజాలపై మోస్తున్న ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రమేష్, తన సోదరుడి శవపేటికను భుజాన వేసుకుని, కుటుంబ సభ్యులు, సంతాపకులు డయ్యూలో అంతిమ సంస్కారాల కోసం వెళ్తున్న వీడియో కన్నీరు పెట్టిస్తోంది.

కాగా, ఎయిర్ విమానం బిజె మెడికల్ కాలేజీ హాస్టల్‌లోకి దూసుకెళ్లిన తర్వాత మండుతున్న శిథిలాల నుండి స్వల్ప గాయాలతో రమేష్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న వారందరూ ఈ ఘటనలో మరణించగా.. రమేష్ ఒక్కడే బతికాడు. అనంతరం ఆస్పత్రిలో చేరిన రమేష్ ను ప్రధాని మోడీ పరామర్శించి..మాట్లాడారు. తాజాగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.

తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం మాకు లేదు: నిమ్మల

tenders many projects

అమరావతి: మమ్మల్ని విమర్శించే తెలంగాణ నేతలు వారు చేసిన పనులు గుర్తుచేసుకోవాలని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలన్న దురుద్దేశం తమకు లేదని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనుమతుల్లేకుండానే తెలంగాణ అనేక ప్రాజెక్టులకు టెండర్లు పిలిచిందని, కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులను అనుమతి లేకుండానే చేపట్టారని అన్నారు.  పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును అనుమతి లేకుండానే చేపట్టలేదా? అని ప్రశ్నించారు. ప్రాథమిక దశ లోనే ప్రాజెక్టును అడ్డుకోవడం సమంజసమేనా? అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

భారత్‌కి మరింత బలం.. జట్టులోకి కీలక ఆటగాడు..?

Harshith Rana

భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. తక్కువ మంది అనుభవజ్ఞులు ఉన్న జట్టుతో బరిలోకి దిగుతున్న భారత్.. ఇంగ్లండ్‌ని ఎలా ఎదురుకుంటుందో అని అంతా వేచి చూస్తున్నారు. ఈ సిరీస్‌కి ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతను శుభ్‌మాన్ గిల్‌కి అప్పగించారు. ఇక వైస్ కెప్టెన్ స్థానం రిషబ్ పంత్‌కి దక్కింది. మొదటిసారిగా సాయి సుదర్శన్ జట్టులో చోటు సంపాదించుకోగా.. శార్ధూల్ ఠాకూర్, కరుణ్ నాయర్‌లు సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్‌లు ఐదుగురు బౌలర్లు ఉణన్నరు. ఇప్పటికాదా ఈ ఐదుగురు బౌలర్లతో పటిష్టంగా ఉన్న భారత్‌కు మరింత బలం చేకూర్చుస్తూ.. మరో బౌలర్‌ని జట్టులోకి తీసుకున్నరు. అతనే హర్షిత్ రాణా (Harshith Rana). గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగన సిరీస్‌లో హర్షిత్ టెస్టుల్లోకి ఆరంగేట్రం చేశాడు. ఆ సిరీస్‌లో50.75 యావరేజ్‌తో నాలుగు వికెట్లు తీశాడు.భారత్‌ ఏ జట్టు, ఇంగ్లండ్‌ లయన్స్‌కు మధ్య జరిగిన మొదటి అనధికార టెస్టులో హర్షిత్‌ రాణా 99 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో 16 పరుగులు చేశాడు. అయితే హర్షిత్ గురించి బిసిసిఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

‘నువ్వొక నియంతవు’… అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా నిరసనలు

వాషింగ్టన్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్కు అమెరికాలో ఛేదు అనుభవం ఎదురైంది. మంగళవారం అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న అసిమ్ మునీర్.. తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. మునీర్ కు వ్యతిరేకంగా పాకిస్థానీయులు నిరసనలకు దిగారు. వాషింగ్టన్‌లో పాకిస్తాన్ జాతీయులు, పాకిస్తాన్ మూలాలు కలిగిన ప్రజలు.. మునీర్ ఉన్న హోటల్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అసిమ్ మునీర్, నువ్వు పిరికివాడివి అని నిరసనకారులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్మీ చీఫ్ మునీర్ వాషింగ్టన్‌లోని హోటల్‌కు చేరుకోగానే ఆయనకు వ్యతిరేకంగా నిరసనకారులు..”అసిమ్ మునీర్, నువ్వొక పిరికివాడివి, సామూహిక హంతకుడివి, నియంతవి” అని నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. నిరసనలతో మునీర్ ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించడంతో అధికారులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు వారితో వాదనలకు దిగారు.

వెంటనే టెహ్రాన్ నుంచి వచ్చేయండి.. భారతీయులకు హెచ్చరిక

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వైమానిక దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు పరస్పరం క్షిపణులతో భీకర దాడులకు దిగడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఇరుదేశాల మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో అన్ని ఎయిర్ పోర్టులు మూసివేశారు. మరోవైపు, జీ-7 సమావేశం నుంచి డోనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా అమెరికా వెళ్లిపోయారు. దీంతో ఇరాన్ లో ఏక్షణమైనా ఏదైనా జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు ఇరాన్ గగనతలంపై ఆంక్షలు విధించింది. దీంతో విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను వదిలి స్వదేశానికి రావాలని భారతీయులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో టెహ్రాన్ నుంచి అప్ఘనిస్తాన్ మీదుగా భారతీయులు.. ఇండియాకు చేరుకుంటున్నారు. కాగా, ఈ దాడుల్లో ఇరుదేశాల్లో దాదాపు 300కు పైగా మంది మృతి చెందగా.. వందల మంది గాయాలపాలయ్యారు.

కమల్‌హాసన్‌కి సుప్రీం కోర్టులో భారీ ఊరట.. అందుకు లైన్ క్లియర్

Kamal Hassan Thug Life

న్యూఢిల్లీ: కమల్‌హాసన్ (Kamal Hassan), మణిరత్నం కాంబినేషన్‌లో రీసెంట్‌గా వచ్చిన చిత్రం ‘థగ్‌ లైఫ్’ (Thug Life). జూన్ 5న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా (Thug Life) విడుదలకు ముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఈవెంట్‌లో కమల్ (Kamal Hassan) చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కన్నడ ప్రజలు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కానీ, కమల్ అందుకు నిరాకరించారు. ఈ క్రమంలో ఈ సినిమా కర్ణాటకలో విడుదల చేయలేదు.

అయితే ఇఫ్పుడు కమల్‌హాసన్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ‘థగ్ లైఫ్’ సినిమాని కర్ణాటకలో విడుదల చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం హెచ్చరించింది. థియేటర్స్‌లో ఏమి ప్రదర్శించాలనే అధికారం గుంపులకు, అచారక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్ట పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. అలాగే కమల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టే హక్కు కన్నడ ప్రజలకు ఉందని.. ప్రాథమిక హక్కులను కాపాడాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కమల్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని నమ్మితే ఒక ప్రకటన ఇస్తే చాలని.. అంతేకానీ, థియేటర్లు తగలబెడతామని ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించింది.

 

ఈ ఏడాదిలో జాన్వీ పెళ్లి.. లేకుంటే అప్పటివరకూ ఆగాల్సిందే..?

Janhvi Kapoor

అతిలోక సుందరీ శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కాపూర్ (Janhvi Kapoor) ఆ తర్వాత తనకంటే గుర్తింపును సంపాదించుకుంది. బాలీవుడ్‌ మంచి సక్సెస్ సాధించిన జాన్వీ తెలుగులో ‘దేవర’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఓ జ్యోతిష్యుడు జాన్వీ వివాహం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.. ఆమెకు ఈ ఏడాది వివాహం జరుగుతుందని పేర్కొన్నారు.

సిద్ధార్థ్ కన్నన్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన జ్యోతిష్యుడు సుశీల్ కుమార్.. 2026 కల్లా జాన్వీ (Janhvi Kapoor) కెరీర్‌ పరంగా మంచి పొజిషన్‌కు వెళ్తుందని తెలిపారు. ఇకపోతే.. ఈ ఏడాది జాన్వీ వివాహం జరుగుతుందని.. లేని పక్షంలో ఆమెకు 33 సంవత్సరాలు వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే అని కామెంట్ చేశారు. ఓ వైపు ఆమె వైవాహిక జీవితం బాగుంటుదని చెబుతూనే.. గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం సుశీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలడుతున్నారు: రోజా

Super Six implementing

అమరావతి: అమలు చేయకుండానే సూపర్ సిక్స్  పథకాలు చేసేశామని చెప్తున్నారని ఎపి మాజీ మంత్రి ఆర్ కె రోజా తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలడుతున్నారని అన్నారు. రోజా చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు ఏమైంది? అని ఉచిత బస్సు ఎక్కడా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి లేనే లేదని, గతంలో స్కూల్ మెయింటినెన్స్ రూ. వెయ్యి తీసుకుంటే..ఇప్పుడు చంద్రబాబు రూ.2 వేలు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రీయ విద్యార్థులకు (Central students) తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. కూటమి మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం అని రోజా పేర్కొన్నారు.

బిఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్..రోజుకు 2జీబీ డేటా, 80 రోజుల వ్యాలిడిటీ..

Private telecom companies hike mobile recharge price

ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడటానికి ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఒకదాని తర్వాత ఒకటి చౌకైన, ఎక్కువ ప్రయోజనాలతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కంపెనీ ఇప్పుడు మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో కాలింగ్, డేటా ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా దాదాపు 80 రోజుల దీర్ఘకాల చెల్లుబాటుతో వస్తుంది. ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ గురించి పూర్తిగా చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ కంపెనీ రూ. 485 ప్లాన్‌ను తీసుకొచ్చింది.ఈ ప్లాన్ లో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అంటే రోజంతా కావలసినంత మాట్లాడవచ్చు. దీనితో పాటు బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ 100 ఉచిత SMSలను కూడా అందిస్తోంది. అంటే.. డేటా, కాలింగ్‌తో పాటు సాధారణ SMSలను కూడా పంపవచ్చు.

ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి, రీఛార్జ్ ప్లాన్ చేసుకోవడానికి బడ్జెట్ దాదాపు రూ. 500 మాత్రమే ఉంటె ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక కావచ్చు. ప్రైవేట్ టెలికాం కంపెనీల ప్లాన్‌లో ఈ ప్రయోజనాలన్నింటినీ కోరుకుంటే కనీసం రూ. 600 ఖర్చు చేయాల్సి ఉంటుంది.