3 నెలల నుంచి సఫాయి కార్మికులకు జీతాలు అందట్లేదు: హరీష్ రావు

Harish Rao comments Revanth Reddy

హైదరాబాద్:  ట్రాక్టర్ల లో డిజిల్ పోయలేకనే… గ్రామాల్లో చెత్త సేకరించట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. .ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు అందట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంట్రాక్టర్లు 10 నుంచి 20 శాతం కమీషన్ ఇస్తే బిల్లులు చెల్లిస్తున్నారని చెప్పారు.సఫాయి కార్మికులు కమీషన్ ఇవ్వలేరు కాబట్టి జీతాలు ఇవ్వట్లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి (Hyderabad – Delhi) వెళ్లేందుకే సిఎం రేవంత్ రెడ్డి కు సమయం సరిపోతుందని చురకలంటించారు. నెలకోసారి కూడా సిఎం సచివాలయానికి వెళ్లట్లేదని హరీష్ రావు దుయ్యబట్టారు.

ఎంపి రఘునందన్‌‌రావును చంపేస్తామంటూ బెదిరింపు కాల్

Raghunandan Rao

హైదరాబాద్: బిజెపి ఎంపి రఘునందన్‌రావుకు (Raghunandan Rao) బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన్ను సాయంత్రంలోగా చంపేస్తామంటూ పీపుల్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఫోన్‌ కాల్‌ను రఘునందన్‌రావు పిఎ ఎత్తాడు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని ఆగంతకుడు చెప్పాడు. దమ్ముంటే కాపాడుకోండని రఘునందన్‌ను అతడు బెదిరించాడు.

మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపి రఘునందన్‌ (Raghunandan Rao) పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రఘునందన్‌ రావు అప్రమత్తమై తెలంగాణ డిజిపి జితేందర్‌, సంగారెడ్డి ఎస్పి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ 912143352974 అనే నెంబర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఎంపి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్ వచ్చిన నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

రాజకీయాల్లోకి ఎంట్రీపై గంగూలీ ఆసక్తికర కామెంట్స్

Sourav Ganguly

కోల్‌కతా: టీం ఇండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీకి (Sourav Ganguly) దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన కెప్టెన్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు భారత్‌ జట్టుకు ఆ తర్వాత కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. అందుకే గంగూలీ అంటే క్రికెట్ అభిమానుల్లో అంత క్రేజ్ ఉంటుంది. అయితే గంగూలీ రాజకీయ ఆరంగేట్రంపై చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రతీసారి ఆయన వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు.

తాజాగా మరోసారి ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి గంగూలీని (Sourav Ganguly) ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైనా పార్టీలో చేరుతారా అని పిటిఐ ఇంటర్వ్యూలో గంగూలీని ప్రశ్నించగా.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అయితే ‘ఒకవేళ సిఎం పదవి ఇస్తామని హామీ ఇస్తే’ అని కూడా ఆయన్ను అడగగా ‘నాకు ఆసక్తి లేదని గంగూలీ అన్నారు.

జగన్ పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారు: గొట్టిపాటి

Gottipati Ravikumar comments jagan

అమరావతి: ప్రజల్లో ఆదరణ ఉందని చూపడం కోసం ఎపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అమాయకులను బలిగొంటున్నారని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తన పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు గాల్లో కలుపుతున్నారని మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ లో డబ్బు(Money betting) పోగొట్టుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లి…మరో రెండు నిండు ప్రాణాలు బలితీసుకున్నారని విమర్శించారు. వాహనం ఢీకొన్న వెంటనే ఆసుపత్రికి తరలిస్తే సింగయ్య ప్రాణం నిలబడేదని ఆవేదనను వ్యక్తం చేశారు. చేసిన పనికి కనీసం పశ్చాత్తాపం కూడా లేదని గొట్టిపాటి రవికుమార్ దుయ్యబట్టారు.

తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు: భూమన

Uncontrolled liquor sales

అమరావతి: తిరుపతిలో తెల్లవారుజాము నుంచే మద్యం షాపులు తెరుస్తున్నారని వైసిపి మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల పాటు మద్యం విక్రయిస్తున్నారని రూల్స్ కు విరుద్ధంగా (Against rules) నడుస్తున్న మద్యం అమ్మకాలపై చర్యలేవి? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలపై ఆందోళన చేపడతామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.

ఆ హీరోయిన్‌పై కోపం.. సందీప్ వంగా ఈ విధంగా చూపించారా..?

Sandeep Reddy Vanga

తీసిన సినిమాలు తక్కువే అయినా.. యూత్‌లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆయన.. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందే చిన్న కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్‌ని తీసుకోవాలని భావించగా.. కొన్ని కండీషన్స్ వల్ల ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించారు.

అయితే ఈ విషయంపై సందీప్ (Sandeep Reddy Vanga) తీవ్రంగా స్పందించారు. తను ఆ హీరోయిన్‌ను నమ్మి స్టోరీ మొత్తం చెప్పానని.. దర్శకులు నటీనటులకు కథ నెరేట్‌ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్‌క్లోజర్‌ అగ్రిమెంట్‌ ఉన్నట్లే.. కానీ, ఆ హీరోయిన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి స్టోరీ లీక్ చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది. నటి దీపికా పదుకొణె గురించే ఈ పోస్ట్ పెట్టారని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు సందీప్ పెట్టిన మరో పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.

తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ అనే పేరుతో సందీప్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన ఆరు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా సందీప్ హీరో షాహిద్ కపూర్ లేకుండా.. కేవలం హీరోయిన్ కియారా అడ్వాణీ ఫోటోని పోస్ట్ చేసి.. విషెస్ చెప్పారు. దీంతో ఇది మళ్లీ చర్చకు దారి తీసింది. స్టార్ హీరోయిన్‌తో వివాదం వేళ కియారాను ప్రశంసించేందుకే సందీప్ ఈ విధంగా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్న పథకాలన్నీ అమలు చేస్తున్నాం: షబ్బీర్ అలీ

Shabbir Ali

నిజామాబాద్: ప్రభుత్వం అప్పుల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుందని ప్ఱభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ (Shabbir Ali)  మాట్లాడుతూ.. ఆదివారం కళ్యాణ లక్ష్మి 130 మంది లబ్ధిదారులకు ఒక కోటి 60 లక్షల 18,560 రూపాయలను పంపిణీ చేస్తున్నామని, అలాగే షాదీ ముబారక్ 442 లబ్ధిదారులకు నాలుగు కోట్ల 12 లక్షల 47వేల 792 రూపాయలు అందించామని.. మొత్తం లబ్ధిదారులకు ఐదు కోట్ల 72 లక్షల 66,352 రూపాయలు అందించామని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులలో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. రూ.500కు సిలిండర్, 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇందిరమ్మ ఇల్లు రైతు రుణమాఫీ, రైతు భరోసా, యువతకు ఉద్యోగాలు, రాజీవ్ యువ వికాసం పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు తహర్ బిన్ హందన్, కీరవత్రి అనిల్, మోహన్ రెడ్డి , నూడా చైర్మన్ కేశ వేణు, గ్రంధాలయ చైర్మన్ రాజి రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓ చిన్న తప్పు.. శుభ్‌మాన్ గిల్‌కు జరిమానా..?

Shubman Gill

లీడ్స్: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శుభ్‌మాన్ గిల్ (Shubman Gill).. తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా అతడు రికార్డు సాధించాడు. అయితే శుభ్‌మాన్ చేసిన ఓ చిన్న తప్పుకు అతడికి జరిమానా పడే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో శుభ్‌మాన్ (Shubman Gill) నలుపు రంగు సాక్సులు ధరించాడు. ఐసిసి ప్లేయర్ క్లాతింగ్-ఎక్విప్‌మెంట్ నిబంధన (క్లాస్ 19.45) ప్రకారం.. టెస్ట్ మ్యాచ్‌లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా బూడిద రంగులో ఉండాలి. ఈ నేపథ్యంలో డ్రెస్ కోడ్ ఉల్లంఘించినందుకు గిల్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే అది మ్యాచ్ రెఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఐసిసి నిబంధనల ప్రకారం లెవల్ 1 తప్పిదానికి ఫైన్ తప్పదు. కానీ, గిల్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ తప్పు చేయలేదని రెఫరీ భావిస్తే.. అతడు జరిమానా నుంచి తప్పించుకొనే అవకాశం ఉంది.

కాగా, ఈ మ్యాచ్‌‌లో 227 బంతులు ఎదురుకున్న గిల్ 147 పరుగులు చేసి బషీర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 107 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 453 పరుగులు చేసింది. క్రీజ్‌లో పంత్ (134), జడేజా (2) ఉన్నారు.

యోగాంధ్ర పై.. జగన్ విమర్శలకు చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్నిగురించి వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాధనం వృథా అంటూ విమర్శలు చేశారు. యోగాంధ్ర గూర్చి జగన్ వ్యతిరేకతపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace) కు రూ. వందల కోట్లు ఖర్చు చేసిన వాళ్లు ఎద్దేవా చేస్తున్నారని, ఇలాంటి శుభ సందర్భంలో కొందరి గురించి మాట్లాడటం అనవసరం అని అన్నారు. కాలుష్యాన్ని కలుషితం చేద్దామనుకునే చర్యలను ఉపేక్షించనని హెచ్చరించారు. భూతాన్ని నియంత్రించడంపై ప్రజలను చైతన్యపరుస్తాం అని యోగాంధ్రకు కేంద్రం రూ.75 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

పంత్ వీరోచిత బ్యాటింగ్.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు

Rishabh Pant

లీడ్స్: ఇంగ్లండ్‌లో హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సెంచరీలతో చెలరేగిపోగా.. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) అర్థశతకం సాధించాడు. జైస్వాల్ వికెట్ తర్వాత క్రీజ్‌‌లోకి వచ్చిన పంత్ తన దూకుడైన బ్యాటింగ్‌తో దంచికొడుతున్నాడు. ఈ క్రమంలో టీం ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును పంత్ బద్దలుకొట్టాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా పంత్ (Rishabh Pant) రికార్డు సాధించాడు. డబ్ల్యూటిసిలో 35 మ్యాచులు ఆడిన పంత్ 58 సిక్సులు కొట్టాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ(56) పేరిట ఉండేది. కాగా, రెండోరోజు 359 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ బ్యాట్స్‌మెన్లు గిల్, పంత్‌లు నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. 94 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి భారత్ 393 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్ (139), పంత్ (84) ఉన్నారు.