కమల్‌హాసన్‌కి సుప్రీం కోర్టులో భారీ ఊరట.. అందుకు లైన్ క్లియర్

Kamal Hassan Thug Life

న్యూఢిల్లీ: కమల్‌హాసన్ (Kamal Hassan), మణిరత్నం కాంబినేషన్‌లో రీసెంట్‌గా వచ్చిన చిత్రం ‘థగ్‌ లైఫ్’ (Thug Life). జూన్ 5న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా (Thug Life) విడుదలకు ముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఈవెంట్‌లో కమల్ (Kamal Hassan) చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కన్నడ ప్రజలు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కానీ, కమల్ అందుకు నిరాకరించారు. ఈ క్రమంలో ఈ సినిమా కర్ణాటకలో విడుదల చేయలేదు.

అయితే ఇఫ్పుడు కమల్‌హాసన్‌కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ‘థగ్ లైఫ్’ సినిమాని కర్ణాటకలో విడుదల చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం హెచ్చరించింది. థియేటర్స్‌లో ఏమి ప్రదర్శించాలనే అధికారం గుంపులకు, అచారక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్ట పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. అలాగే కమల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టే హక్కు కన్నడ ప్రజలకు ఉందని.. ప్రాథమిక హక్కులను కాపాడాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కమల్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని నమ్మితే ఒక ప్రకటన ఇస్తే చాలని.. అంతేకానీ, థియేటర్లు తగలబెడతామని ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *