చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ : చంద్రబాబు

handloom industry TDP weavers

అమరావతి: నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలు అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. భారతీయ శక్తి, సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని అన్నారు. తర్వాత అధికంగా ఉపాధి కల్పించే  చేనేత వస్త్ర పరిశ్రమ అని టిడిపికి నేతన్నలకు అవినాబావ సంబంధం ఉందని, నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ అని చెప్పారు. 55,500 మంది చేనేత కార్మికులకు రూ.2 లక్షల చొప్పున రూ.27 కోట్లు రుణాలు, 90, 765 కుటుంబాలకు వంద యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చామని తెలియజేశారు. చేనేత కార్మికులకు తొలిసారిగా 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించామని, చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి.. అందుకే 50 ఏళ్లకే పెన్షన్ తీసుకొచ్చామని అన్నారు.

50 శాతం పెట్టుబడితో మరమగ్గాలకు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టామని, గతప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారని సబ్సిడీలు ఎత్తేశారని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులేనని, ఈ నెల నుంచే 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా (200 units electricity free) ఇస్తామని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ వల్ల 93 వేల కుటుంబాలకు లబ్ధి కలగనుందని, చేనేతలకు ఎంత ఇచ్చినా తక్కువేనని అన్నారు. నేతన్న భరోసా కింద అదనంగా రూ. 25 వేలు ఇప్పించే బాధ్యత తమది భరోసా ఇచ్చారు. 5,386 మందికి రూ. 5 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని, 92,724 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, రూ.546 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లాను అడ్వైజర్ గా నియమించామని, ఏదో చేయాలన్న తపన ఉన్నందునే సుచిత్ర ఎల్లాను నియమించామని చెప్పారు. చేనేత కార్మికుడి నుంచి వినియోగదారుడి వరకు పద్ధతి ప్రకారం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *