డబ్ల్యూటిసి ఫైనల్ అరుదైన ఘటన.. 145 ఏళ్లలో తొలిసారి

WTC Final

లండన్: లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న ఐసిసి డబ్ల్యూటిసి ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, సౌతిఫ్రికా హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లోఆస్ట్రేలియాని సఫారీ బౌలర్లు 212 పరుగులకే ఆలౌట్ చేయగా.. తొలి రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నెంబర్ 1 స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఆటగాళ్లు డకౌట్ అయ్యారు.

డబ్ల్యూటిసి ఫైనల్‌లో (WTC Final) ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా 20 బంతులు ఆడి పరుగులు చేయకుండా పెవిలియన్ చేరగా.. సఫారీ బ్యాట్స్‌మెన్ ఎయిడెన్ మార్క్రమ్ 6 బంతులు ఎదురుకొని డకౌట్ అయ్యాడు. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి. 1880లో మొట్టమొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్‌ ఇంగ్లండ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌తో కలుపుకొని ఇంగ్లండ్‌లో 561 టెస్ట్‌ మ్యాచ్‌లు జరగగా.. ఇప్పటివరకూ ఇలాంటి సంఘటన జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఇరు జట్ల నెంబర్ 1 ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ డకౌట్ అవ్వడం ఇది 10వ సారి. తొలిసారిగా 1977లో ఆస్ట్రేలియా ఇండియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్, ఆసీస్ బ్యాట్స్‌మెన్ జాన్ డైసన్ డకౌట్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *