కృష్ణా, గోదావరి బేసిన్ జలాలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమే: భట్టి

Bhatti Vikramarka fire Brs

హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లెక్కలు తీసుకొని అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఒకరికి సవాల్ విసిరితే మరొకరు బయటకు వచ్చారు అని అన్నారు. మహబూబాబాద్ లో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రూ. లక్ష రుణమాఫీ విషయంలో మాజీ సిఎం కెసిఆర్ రెండుసార్లు మోసం చేశారని మండిపడ్డారు.

తొలిసారి రుణమాఫీ (Loan waiver first time) పూర్తి చేసేందుకు ఐదేళ్ల సమయం తీసుకున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ నేతలు పదేళ్లలో రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి బేసిన్ జలాలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. కాళేశ్వరం నిర్మించి పది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని, అసత్యాలు మానకపోతే.. బిఆర్ఎస్ కు డిపాజిట్లు రావు అని అన్నారు. నోరుందికదా అని కెటిఆర్ ఏది పడితే అది మాట్లాడమేనా? అని భట్టి ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *