ఐసిసి ర్యాంకుల్లో శుభ్‌మాన్‌కి షాక్.. అన్ని పరుగులు చేసినా..

Shubman Gill

భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో టీం ఇండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌ (Shubman Gill) అద్భుతంగా రాణించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకొన్న తొలి సిరీస్‌లోనే జట్టును ముందుండి నడిపించాడు. బ్యాటింగ్‌తో కూడా అతడు చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే సిరీస్ ముగిసిన రెండు రోజులకే ఐసిసి ర్యాంకులను ప్రకటించింది. ఇందులో శుభ్‌మాన్ గిల్‌కు షాక్ తగిలింది. తాజాగా ప్రకటించిన ఐసిసి ర్యాంకుల్లో గిల్ నాలుగో స్థానాలు కోల్పోయాడు. అందుకు కారణం లేకపోలేదు.

ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా గిల్ (Shubman Gill) రికార్డు సృష్టించాడు. ఇంగ్లండపై ఈ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో ఏకంగా 754 పరుగులు చేశాడు. అయితే ఐదో టెస్ట్‌కి ముందు గిల్ ఐసిసి ర్యాంకుల్లో 9వ స్థానంలో ఉన్నాడు. కానీ, చివరి టెస్టులో అతను కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే అతని ర్యాంకుపై ప్రభావం చూపించింది. ఐదో టెస్ట్‌లో కనీసం అర్థశతకం సాధించిన గిల్ ర్యాంకు రేటింగ్‌లో బాగా తేడా వచ్చేదే. గిల్ విషయం పక్కన పెడితే చివరి టెస్టులో శతకం సాధించిన యశస్వీ జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపరచుకోగా.. ఐదో టెస్ట్ ఆడకపోవడంతో పంత్ ఒకస్థానం కోల్పోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *