హైదరాబాద్: అల్లు అర్జున్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా ‘పుష్ప-2’ ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తిలిసిందే. అయితే ఆ చిత్రం విడుదల సందర్భంగా హైదరాబద్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోన సంధ్య థియేటర్లో ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. దీంతో తమ అభిమాన హీరోను చూస్తేందుకు వేల సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి.. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. (NHRC)
తాజాగా ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ సిఎస్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) (NHRC) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ ఘటన దర్యాప్తుపై ఎన్‌హెచ్‌ఆర్‌సి అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులు సమర్పించిన నివేదికపై అసంతృప్తి తెలిపింది. బాధిత కుటుంబానికి పరిహారం రూ.5 లక్షలు ఇచ్చేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని కమిషన్ అడిగింది. షోకు పోలీసులు అనుమతి లేదని రిపోర్టులో తెలిపారని.. అనుమతి లేకుంటే నటుడు, అభిమానులు ఎందుకు వచ్చారో తెలియట్లేదు అని పేర్కొంది. ముందే చర్యలు తీసుకుంటే తొక్కిసలాట జరిగేది కాదని తెలిపింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆరు వారాల్లో మరో నివేదిక ఇవ్వాలని.. దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయాలని హైదరాబాద్ సిపికి ఆదేశాలు జారీ చేసింది.
Leave a Reply