బిఆర్ఎస్ నేతలు ఇంకెంతకాలం ప్రజలను మభ్య పెడతారు: పొంగులేటి

Ponguleti Srinivas Reddy comments BRS

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు గత కేబినెట్ అనుమతులు ఉన్నాయనడం అవాస్తవం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. బిఆర్ఎస్ నేతలు ఇంకెంతకాలం ప్రజలను మభ్య పెడతారని అన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఏం చేశారన్నది కమిషన్ నివేదికలో స్పష్టంగా ఉందని తెలియజేశారు. బిఆర్ ఎస్ నేతలు కంగారుపడొద్దని అన్ని వివరాలు అసెంబ్లీ ముందు ఉంచుతామని చెప్పారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ తర్వాత నిర్ణయం తీసుకుంటామని సూచించారు. కాళేశ్వరం పేరుతో కెసిఆర్ డబ్బు దోచుకున్నారని (KCR stolen money) ముందే చెప్పామని అన్నారు. పిసి ఘోష్ నివేదికలో అన్నీ వివరంగా ఉన్నాయని, దోచుకున్న డబ్బుతో మళ్లీ బిఆర్ఎస్ నేతలు జనంలోకి వస్తారని పేర్కొన్నారు. డబ్బు తీసుకుని బిఆర్ఎస్ చెంపలు చెళ్లుమనిపించాలని పొంగులేటి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *