పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం నాది కాదు: రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy fire congress

హైదరాబాద్: ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తెలిపారు. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్ లోకి వచ్చానని అన్నారు. మునుగోడు ఎమ్ఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారని మండిపడ్డారు. పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదని తెలియజేశారు. భువనగిరి ఎంపిని గెలిపిస్తే (wins Bhuvangiri MP) మంత్రి పదవిని ఇస్తారన్నారని, తనకు మంత్రి పదవిని ఇస్తారా..ఇవ్వరా అనేది తమ ఇష్టం అని అన్నారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని, మనసు చంపుకని బతకడం తన వల్ల కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *