తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా: రేవంత్

Genome Valley uniqueo pharma companies

హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ కేపిటల్ గా హైదరాబాద్ కు గుర్తింపు లభించిందని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలకు జినోమ్ వ్యాలీ ప్రత్యేకమైనది అన్నారు. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీని, గచ్చిబౌలిలో ప్రముఖ లిల్లీ ఫార్మా కంపెనీని సిఎం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా తెలంగాణ ఉంటుందని తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం తెలంగాణ నుంచే అందిస్తామని, హైదరాబాద్ నుంచే 40 శాతం ఫార్మా ఉత్పత్తులు, అత్యధిక వ్యాక్సిన్లు తయారవుతున్నాయని అన్నారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. హైదరాబాద్ ను భవిష్యత్ గ్లోబల్ హెల్త్ కేర్ హబ్ గా మారుస్తామని రేవంత్ రెడ్డ్డి
పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *