విదేశాల్లో సిరాజ్ పవర్.. సెంచరీ పూర్తి చేసిన డిఎస్పీ

Mohammed Siraj

లండన్: భారత్-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌ మ్యాచ్ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు తెగ కష్టపడుతున్నాయి. భారత్ తమకిచ్చిన టార్గెట్‌ని పూర్తి చేయాలని ఇంగ్లండ్ అనుకుంటోంది. మరోవైపు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి సిరీస్‌ని దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత బౌలర్లు ఇంగ్టండ్‌ను కట్టడి చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

మూడో రోజు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే(14) వికెట్ తీసిన సిరాజ్ విదేశాల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ రికార్డును కేవలం 27 మ్యాచుల్లోనే సిరాజ్ (Mohammed Siraj) సొంతం చేసుకున్నాడు. టెస్ట్ కెరీర్‌లో 119 వికెట్లు తీశాడు. ఇందులో విదేశాల్లోవే 100 కావడం విశేషం. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్‌లో భారత్ 396 పరుగులు చేసి ఇంగ్లండ్‌కి 374 పరుగులు టార్గెట్ ఇచ్చింది. నాలుగో రోజు లంచ్‌ బ్రేక్ సమయానికి 38 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజ్‌లో బ్రూక్ (38), రూట్ (23) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే.. భారత్‌కు 7 వికెట్లు, ఇంగ్లండ్‌కు 210 పరుగులు అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *