హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ సొంత లాభం మాత్రమే చూసుకున్నారని తెలంగాణ పిసిసి ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. కెసిఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ తేల్చిందని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో జనహిత పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మహేశ్ మీడియాతో మాట్లాడుతూ..ఇంజినీర్లు చెప్పింది కెసిఆర్ వినలేదని, తనకు ఇష్టం ఉన్న చోట ప్రాజెక్టు కట్టాలని కెసిఆర్ చెప్పారని అన్నారు. ఈ- కార్ రేస్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అవినీతికి పాల్పడలేదా? (KTR involved corruption) అని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లు కక్కక తప్పదని మహేశ్ హెచ్చరించారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న నియోజక వర్గాల్లో ఇబ్బందులు ఉన్నాయని, ప్రతిపక్షాల కుట్రల వల్ల వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ లో గ్రూపులు సహజం.. పార్టీలో గ్రూపులు ఉండాలని, ఎన్నికల సమయానికి అందరూ పార్టీ కోసం పోరాడాలని సూచించారు. గ్రూపుల వల్ల నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తమది అని హామీ ఇచ్చారు. కెసిఆర్ కుటుంబం అబద్ధాల పుట్టని, బిఆర్ఎస్ చేతగానితనం వల్ల బనకచర్ల ప్రాజెక్టు కు ఎపి ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. తమ ఫిర్యాదు వల్లే బనకచర్ల ప్రాజెక్టు పనులు ఆగాయని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Leave a Reply