అమరావతి: ఎపి వ్యవసాయంలో టెక్నాలజీని ప్రవేశ పెట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రంగా రీజినల్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో రైతులతో సిఎం ముఖాముఖి మాట్లాడారు. ‘‘ అన్నదాత సుఖీభవ’ తో ఎపిలో 46 లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చామని తెలియజేశారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని మండిపడ్డారు.
వైసిపి పాలనలో ఇబ్బంది పడుతూ పెన్షన్లు పెంచారని విమర్శించారు. కూటమి పాలనలో ఒక్కసారే పెన్షన్లు పెంచామని అన్నారు. గత పాలకులు పెన్షన్లు (Pensions past rulers) ఇవ్వకుండా ఎగ్గొట్టారని, తాము లబ్దిదారులకు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి పెన్షన్లు ఇస్తాం అని చెప్పారు. గత ఐదేళ్లు ఎన్నికల ముందు, రాక్షస పాలన ప్రజలు సైకో పాలన చూశారని, గత పాలనలో అందరినీ ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. వైసిపి వ్యతిరేక ఓటు చీలకూడదని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ పొత్తు కోసం ముందుకు వచ్చారని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
Leave a Reply