ఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో అనుమానం ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. ఎన్నికల్లో స్వీప్ చేసే విజయాలపై అనుమానాలున్నాయని అన్నారు. ఈ సందర్బంగా ఢిల్లీ వార్షిక న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఎన్నికల వ్యవస్థలో ఏదో తప్పు జరుగుతోందనే సందేహం ఉందని, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఎన్నికల నిర్వహణలో లోపాల గురించి మాట్లాడితే సాక్ష్యాలు అడిగారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో తమ కూటమి ఎక్కువ సీట్లు సాధించిందని తెలియజేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి తుడిచిపెట్టుకు పోయిందని, 4 నెలల వ్యవధిలోనే మహారాష్ట్ర లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో (Maharashtra elections) 4 నెలల్లోనే అంత వ్యత్యాసం ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో లోపాలను మహారాష్ట్ర ఎన్నికల్లో గుర్తించామని, మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికలు అయ్యాక కొత్తగా కోటి ఓట్లు చేరాయని అన్నారు. మహారాష్ట్రలో 4 నెలల్లోనే అదనంగా కోటి మందిని ఓట్లరుగా చేర్చారని, ఓటర్ల జాబితాలో కొత్తగా చేరిన ఓట్లలో అధికభాగం బిజెపికి వెళ్లాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Leave a Reply