న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని అన్నారు. ఈ ఓట్ల చోరీ అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. బిజెపి కోసం ఇసి ఓట్లను చోరీ చేస్తోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా కోటి ఓట్లు చేర్చారని పేర్కొన్నారు. ఇసి అక్రమాలపై ఆరు నెలలపాటు దర్యాప్తు చేశామన్నారు. అణుబాంబు లాంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. ఆ అణుబాంబు పేలితే ఎన్నికల సంఘమే ఉండదని హెచ్చరించారు. ఇసిలో అక్రమాలకు పాల్పడిన ఏ స్థాయి అధికారినైనా, ఒకవేళ రిటైరైనా వదిలి పెట్టామని స్పష్టం చేశారు.
బిజెపి కోసం ఇసి ఓట్లను చోరీ చేస్తోంది: రాహుల్ గాంధీ

Leave a Reply