అమరావతి: ఎపిలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటిని టిడిపి గూండాలు ధ్వంసం చేశారని అన్నారు. వైసిపి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని పరిశీలించారు. ప్రసన్న కుమార్, కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. నెల్లూరులో జగన్ మీడియాతో మాట్లాడుతూ..తన పర్యటనలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? అని ప్రశ్నించారు. జనం రాకుండా ఏకంగా రోడ్లనే తవ్వేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిని చూసి ఎపి సిఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని, తన పాలన చూసి చంద్రబాబే భయపడుతున్నారని విమర్శించారు. అభిమానులను ఆపడానికి 2 వేల మందికి పైగా పోలీసులు మోహరించారని చెప్పారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ప్రజలను వెన్నుపోటు పొడిచారని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా దీవెన, వసతి దీవెన అందక ఇబ్బంది పడుతున్నారని, నాడు- నేడు ఇంగ్లీష్ మీడియం ఆగిపోయిందని అన్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, ఉచిత పంటల బీమాను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. రైతు భరోసాను సైతం ఖూనీ చేశారని, రైతు ఆత్మహత్యలే శరణ్యం(Farmer suicide refuge) అంటున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. మనం ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని రద్దు చేశారని, ప్రశ్నించే వారి గొంతుకలను నొక్కుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అని అన్నారు. ఇళ్లపై దాడులేంటి? మనుషులను చంపాలని చూడటం ఏంటీ? అని నిలదీశారు. మారణాయుధాలతో ప్రసన్న కుమార్ ఇంటిని ధ్వంసం చేశారని, ప్రసన్న ఇంట్లో ఉంటే చంపేసేవారని చెప్పారు. మాజీ మంత్రి ఆర్ కె రోజాపై కూడా అసభ్యకర మాటలు మాట్లాడుతున్నారని, ఉప్పాల హారికపై దాడి కూడా దాడి చేశారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారని పేర్కొన్నారు. మనిషి నచ్చక పోతే చంపేస్తారా? అని జగన్ ప్రశ్నించారు.
Leave a Reply