షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి.. తన ప్రతిభతో అందరినీ మెప్పించి.. వెండితెరపై సక్సెస్‌ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు సుహాస్. అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓ భామ.. అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama). ఈ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్. ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. కామెడీతో పాటు ఎమోషన్స్ కలిసి ఈ సినిమా సుహాస్ ఖాతాలో మరో హిట్‌గా నిలిచింది.
ఇక ఈ సినిమా (Oh Bhama Ayyo Rama) ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ ఈటివి విన్‌లో ఈ సినిమా ఆగస్టు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి ఒటిటి సంస్థ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాకి రామ్ గోదల దర్శకత్వం వహించగా.. రాధన్ సంగీతం అందించారు. అలీ, అనిత, పృథ్వీ, ప్రభాస్ శ్రీను తదితరులు నటించారు.
Leave a Reply