టీం ఇండియా అండర్-19 (India U-19) జట్టు ఈ ఏడాది మంచి ప్రదర్శన చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత్ యూత్ జట్టు వన్డే సిరీస్‌ని 3-2 తేడాతో కైవసం చేసుకోగా.. రెండు టెస్ట్‌ల సిరీస్ మాత్రం డ్రాగా ముగిసింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత యువకుల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో భారత్ మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లలో తలపడనుంది.
ఈ సిరీస్‌లోనూ (India U-19 )కెప్టెన్సీ బాధ్యతలు యువ సంచనలం ఆయుశ్ మాత్రేకి అప్పగించారు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అభిజ్ఞాన్ కుందుని ఆ పదవి నుంచి తప్పించి వైస్ కెప్టెన్‌గా విహాన్ మల్హోత్రాను నియమించారు. అభిజ్ఞాన్ కేవలం వికెట్ కీపర్‌గా మాత్రమే జట్టులో చోటు దక్కించుకున్నాడు. వీరితో పాటు ఇంగ్లండ్ పర్యటనలో మంచి ప్రదర్శన చేసిన వైభవ్ సూర్య వంశీ, రాహుల్ కుమార్, హర్వంశ్ సింగ్, ఆర్. ఎస్. అంబ్రీష్, కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్, డి. దీపేశ్, అన్మోల్‌జీత్ సింగ్ మరియు నమన్ పుష్కక్‌లు జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు కిషన్ కుమార్, ఉదవ్ మోహన్, అమన్ చౌహాన్ మరియు ఖిలన్ పటేల్‌కి జట్టులో చోటు దక్కింది.
ఇండియా యు-19 జట్టు: ఆయుశ్ మాత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా(వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ సింగ్ (కీపర్), ఆర్. ఎస్. అంబ్రీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్కక్, హెనిల్ పటేల్, డి. దీపేశ్, కిషన్ కుమార్, అన్మోల్‌జీత్ సింగ్, ఖిలన్ పటేల్, ఉదవ్ మోహన్, అమన్ చౌహాన్.
Leave a Reply