ప్రాణాలు కాపాడేందుకు.. భారీ భూకంపాన్ని సైతం లెక్క చేయలేదు..

Earthquake

మాస్కో: సాధారణంగా ఎక్కడైనా భూకంపం (Earthquake) సంభవించిందంటే.. దాని నుంచి పారిపోయి ప్రాణాలు కాపానుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ, ఓ డాక్టర్ల బృందం ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు భారీగా సంభవించిన భూకంపాన్ని సైతం లెక్క చేయకుండా అతనికి ఆపరేషన్ పూర్తి చేశారు. రష్యాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 8.8గా నమోదైంది.

రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పాన్ని భూకంపం (Earthquake) అతలాకుతలం చేసింది. భూకంపం కారణంగా నగరంలోని భవనాలు ఊగిపోయాయి. కానీ, భవనం ఊగిపోతున్న భయపడకుండా ఈ డాక్టర్లు శస్త్ర చికిత్స పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు ఈ వైద్యులు. ఈ వీడియోను రష్యన్ న్యూస్ నెట్‌వర్క్(RT) సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వైద్యుల నిబద్ధతను మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఆ సర్జరీ విజయవంతంగా ముగిసిందని.. రోగి కోలుకుంటున్నారని.. రష్యన్ ఆరోగ్య శాక ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *