శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల సంచారం

elephants roams Srivari Mettu path

తిరుపతి:  తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల గుంపు సంచారం భక్తుల్లో కలకలం రేపింది. 11 ఏనుగులు గుంపుగా తిరుగుతూ పంట పొలాలకు ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపును గుర్తించి అటవీశాఖ, టిటిడి, విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడక వెళ్లే భక్తులకు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తగా శ్రీవినాయక స్వామి చెక్‌ పాయింట్‌ దగ్గర తిరుమలకు కాలనడకన వెళ్లేందుకు శ్రీవారి మెట్టు మార్గం వైపు వెళ్తున్న భక్తులను గంట పాటు నిలిపివేశారు. 11 ఏనుగుల గుంపును పంప్ హౌస్ వద్ద డ్రోన్ కెమెరాతో గుర్తించారు. అధికారులు ఏనుగులను అడవిలోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తులను గుంపులు గుంపులుగా శ్రీవారిమెట్టు వద్దకు భద్రతా సిబ్బంది తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *