కెటిఆర్ కు సవాల్ విసిరిన సీతక్క

Seethakka vs KTR

హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు మంత్రి సీతక్క సవాల్‌ విసిరారు. రాజ్యసభ ఎంపి సిఎం రమేష్‌ ఇంటికి వెళ్లిన విషయంపై కెటిఆర్ ఎందుకు క్లారిటీ ఇవ్వడంలేదని అడిగారు. కెటిఆర్ అబద్దాలకోరు అనేది సిఎం రమేష్ మాటల్లో తెలుస్తుందన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపితో బిఆర్ఎస్ కుమ్మక్కు కాలేదని కెటిఆర్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు తేడా వస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో బిఆర్ఎస్‌ ఓట్లన్నీ బిజెపికి వెళ్లాయని.. కెటిఆర్‌ గుండెపై చేయివేసుకొని ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని సీతక్క డిమాండ్ చేశారు.

లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సి కవిత అరెస్టు తరువాత తన ఇంటికి కెటిఆర్ వచ్చారని రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కవితను విడుదల చేస్తే బిఆర్‌ఎస్‌ను బిజెపిలో విలీనం చేస్తానన్నారని సిఎం రమేష్ మీడియాతో చెప్పారు. తన వల్లే కెటిఆర్ 300 ఓట్లతో గెలిచారని రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయని తనకు సంస్కారం అడ్డువస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *