ఇంగ్లండ్‌తో జరిగుతున్న టెస్ట్ సిరీస్‌కి ముందే టీం ఇండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill). అయితే విదేశీ గడ్డపై జట్టును ఎలా నడిపిస్తాడో అని అందరూ అనుకున్నారు. కానీ, తన కెప్టెన్సీతో జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు గిల్. అంతేకాదు.. తన బ్యాటింగ్‌తో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మొదటి టెస్ట్‌లోనే సెంచరీ సాధించిన అతడు, రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేశాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం విఫలమయ్యాడు. 44 బంతులు ఎదురుకొని 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
అయినప్పటికీ.. ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు గిల్ (Shubman Gill). ఇంగ్ల్డండ్ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డును గిల్ దాటేశాడు. ఈ సిరీస్‌లో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే గిల్ 601 పరుగులు చేసి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. 2018లో కోహ్లీ 593 పరుగులు చేశాడు. ఆ తర్వాత 1990లో అజారుద్దీన్ 426 పరుగులు, 1992లో జావేద్ మియాందాద్ (పాకిస్థాన్) 364 పరుగులు, 2002లో గంగూలీ 351 పరుగులు చేశాడు.
Leave a Reply