ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు : లోకేష్

Mega meeting parents teachers

అమరావతి: మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులేనని ఎపి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తెలిపారు. ప్రతి విజయం వెనుక గురువు ఉంటారని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పి పాఠశాలలో మెగా పిటిఎం 2.0 కార్యక్రమం నిర్వహించారు. పేరెంట్స్, టీచర్ల మెగా సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతోందని చెప్పారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు (Student progress cards) చంద్రబాబు నాయుడు, లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. మనకు నడక, బాధ్యత నేర్పేది అమ్మ అని తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం పథకం  అమలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో నాణ్యత లేని యూనిఫామ్ లు ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పిస్తున్నామని  పేర్కొన్నారు.

షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశామని, పాఠశాలల్లో రాజకీయాలకు తావు లేదని చెప్పారు. అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటాలని ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారని అన్నారు. పవన్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని, విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం అని సూచించారు. పరీక్షల్లో ఒక్క మార్కు తగ్గిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ కష్టపడి గెలుద్దాం అని మన తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వాలని చెప్పారు. తాను విద్యాశాఖను తీసుకుంటే చాలా మంది ఫోన్ చేశారని, కష్టమైన విద్యాశాఖ ఎందుకు అవసరమా? అన్నారని, కష్టపడడమంటే తనకు ఇష్టం అని చెప్పానని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *