టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన గిల్.. ఏ స్థానంలో నిలిచాడంటే..

ICC Test Rankings

ఐసిసి తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను (ICC Test Rankings) ప్రకటించింది. ఈసారి ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా భారత టెస్ట్ కెప్టె‌న్‌గా బాధ్యతలు చేపట్టిన శుభ్‌మాన్ గిల్ తాజా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, రెండో టెస్ట్‌ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన గిల్ 15 స్థానాలు మెరుగుపరుచుకొని.. తాజా ర్యాంకింగ్స్‌లో 807 పాయింట్లతో ఆరో స్థానంలో స్థిరపడ్డాడు. గిల్‌తో పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానం, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.

ఇక తాజా ర్యాంకింగ్స్‌లో (ICC Test Rankings) ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు. రెండో టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన బ్రూక్ జో రూట్‌ను 886 పాయింట్లతో వెనక్కి నెట్టి ప్రపంచ నెం.1 టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక రెండో టెస్ట్‌లో బ్రూక్‌తో పాటు అద్భుత ప్రదర్శన చేసిన జేమీ స్మిత్ 753 పాయింట్లో పదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు జరగలేదు. 898 పాయింట్లతో జస్ప్రీత్ బుమ్రా నెం.1 ర్యాంకులో ఉండగా.. సఫారీ బౌలర్ కగిసో రబాడా 851 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *