వాళ్లందరికీ ‘కన్నప్ప’ టీం స్ట్రాంగ్ వార్నింగ్

Kannappa Movie

హైదరాబాద్: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa Movie) మరో రెండు రోజుల్లో (జూన్ 27) విడుదల కానుంది. భారీ తారగణంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. సోమవారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. మొత్తం రన్‌ టైమ్ 3 గంటల 2 నిమిషాలుగా వచ్చింది. అయితే తాజాగా చిత్ర యూనిట్ కొంతమందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇఛ్చింది. వాళ్లెవరో కాదు క్రిటిక్స్, యూట్యూబర్లు అని తెలుస్తోంది.

కన్నప్ప (Kannappa Movie) సినిమా విడుదల తర్వాత కావాలని సినిమాను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కన్నప్ప మూవీ టీం పెద్ద ప్రెస్ నోట్‌ని విడుదల చేసింది. భారతదేశంలో రాజ్యంగం కల్పించి వాక్‌ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తామని చెబుతూనే.. సినిమాను కించపరిచేలా వ్యవహరిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గతంలో టీజర్ విడుదలైనప్పుడు విజువల్స్, విష్ణుపై గట్టిగా ట్రోల్స్ వచ్చాయి. పలువురు యూట్యూబర్లు టీజర్‌పై కామెంట్ చేయగా.. చిత్ర యూనిట్ వారిపై స్ట్రైక్స్ వేసింది. వాటిని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరసన హీరోయిన్‌గా ప్రీతీ ముకుందన్ నటిస్తోంది. ప్రభాస్, మోహన్‌ బాబు, మోహన్‌ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం.మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *