‘ఎవరినీ నిందించడం లేదు’.. భారత్ ఓటమిపై గంభీర్..

Gautam Gambhir

లీడ్స్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీం ఇండియా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత లోవర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు చెత్త ప్రదర్శన చేశారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 9 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఈ చెత్త ప్రదర్శనపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. తాజాగా, ఈ విషయంపై మ్యాచ్ అనంతరం గౌతమ గంభీర్ (Gautam Gambhir) మాట్లాడారు. ఈ మ్యాచ్ ఓటమికి ఎవరినీ నిదిండం లేదని ఆయన పేర్కొన్నారు.

అందరం ఒక జట్టుగా ఆడాం.. ఓడాం.. గెలుస్తామని అన్నారు. ‘‘ఈ పరాజయానికి ఏ ఒక్కరిని బాధ్యులు చేయను. కొన్నిసార్లు ఆటగాళ్లు విఫలమవడం సహజం. అందుకు మనకంటే వాళ్లే ఎక్కువ బాధపడతారు. తొలి ఇన్నింగ్స్‌లో 570, 580 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.. టెయిల్ ఎండర్స్ తొలి ఇన్నింగ్స్‌లో రాణించి ఉంటే బాగుండేది’’ అన్నారు. ఏ ఒక్కరి వల్ల మేం మ్యాచ్ ఓడిపోలేదు’ ’ అని గంభీర్ (Gautam Gambhir) పేర్కొన్నారు.

ఇక శార్దూల్ ఠాకూర్‌పై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ.. అతన్ని బౌలింగ్ స్పెషలిస్ట్‌గా జట్టులోకి తీసుకోలేదని.. బౌలింగ్ ఆల్ రౌండర్‌గా అతనికి జట్టులో స్థానం కల్పించామన్నారు. అతను కీలకమైన రెండు వికెట్లు తీసిన విషయాన్ని గుర్తు చేశారు. జడేజా మంచిగా బౌలింగ్ చేస్తున్న నేపథ్యంలో ఠాకూర్‌కి ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం రాలేదని అన్నారు.

శుభ్‌మాన్ గిల్ కెప్టెన్సీ తీసుకున్న తొలి మ్యాచ్‌లోనే జట్టు ఓటమిపాలు కావడంపై స్పందిస్తూ.. ‘‘మొదటి మ్యాచ్‌లో కొంచం టెన్షన్ ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌లో అతను గొప్పగా బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయడం గొప్ప విషయం. అతను భవిష్యత్తులో కెప్టెన్‌గా రాణించాలంటే.. అతనికి కొంత సమయం ఇవ్వాలి’’ అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *