డల్లాస్: మేజర్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. సోమవారం టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి చెందిన బ్యాటర్ మిచెల్ ఓవెన్ (Mitchell Owen) ఆల్ రౌండ్ ఫర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. మొదట బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసిన ఓపెన్ ఆ తర్వాత బ్యాటింగ్‌లో 89 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. ఓవెన్‌తో (Mitchell Owen) పాటు.. అండ్రీస్ గౌస్ (80) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో ఎంపిఎల్ ఛరిత్రలోనే అతి భారీ లక్ష్యాన్ని చేధించిన జట్టుగా వాషింగ్టన్ రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. కెప్టెన్ డుప్లెసిస్ (69) అర్థ శతకంతో, స్టోయినిస్ 32, మిలింద్ కుమార్ 31 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ ఓవెన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Leave a Reply