ఓ చిన్న తప్పు.. శుభ్‌మాన్ గిల్‌కు జరిమానా..?

Shubman Gill

లీడ్స్: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌తో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శుభ్‌మాన్ గిల్ (Shubman Gill).. తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌గా తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా అతడు రికార్డు సాధించాడు. అయితే శుభ్‌మాన్ చేసిన ఓ చిన్న తప్పుకు అతడికి జరిమానా పడే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో శుభ్‌మాన్ (Shubman Gill) నలుపు రంగు సాక్సులు ధరించాడు. ఐసిసి ప్లేయర్ క్లాతింగ్-ఎక్విప్‌మెంట్ నిబంధన (క్లాస్ 19.45) ప్రకారం.. టెస్ట్ మ్యాచ్‌లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా బూడిద రంగులో ఉండాలి. ఈ నేపథ్యంలో డ్రెస్ కోడ్ ఉల్లంఘించినందుకు గిల్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే అది మ్యాచ్ రెఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఐసిసి నిబంధనల ప్రకారం లెవల్ 1 తప్పిదానికి ఫైన్ తప్పదు. కానీ, గిల్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ తప్పు చేయలేదని రెఫరీ భావిస్తే.. అతడు జరిమానా నుంచి తప్పించుకొనే అవకాశం ఉంది.

కాగా, ఈ మ్యాచ్‌‌లో 227 బంతులు ఎదురుకున్న గిల్ 147 పరుగులు చేసి బషీర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 107 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 453 పరుగులు చేసింది. క్రీజ్‌లో పంత్ (134), జడేజా (2) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *