తొలి టెస్ట్‌కి ముందు కోహ్లీపై బెన్‌ స్టోక్స్ ఆసక్తికర కామెంట్స్

Ben Stokes Virat Kohli

భారత్, ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకో రెండు రోజులే (శుక్రవారం నుంచి ప్రారంభం) ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది. యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ సారథ్యంలో భారత్ జట్టు ఈ సిరీస్‌లో ఎలా ఆడనుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ లేకుంటే మ్యాచ్‌లో మజా ఉండదు అని కామెంట్ చేశాడు.

టీమిండియా కోహ్లీ సేవలను కచ్చితంగా మిస్ అవుతుందన్న స్టోక్స్ .. అతని పోరాటపటిమ, పట్టుదలకు ఎవరూ సాటిరారని అన్నాడు. 18వ నెంబర్‌ను కోహ్లీ తన గుర్తింపుగా మార్చుకున్నాడని.. వేరే ఆటగాడిపై ఆ నెంబర్‌ చూడటం విచిత్రంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. కోహ్లీ లేని టెస్ట్ క్రికెట్ అంత గొప్పగా ఉండదని.. కోహ్లీ ప్రత్యర్థిగా ఆడటంలో మజా ఉంటుందని తెలిపాడు. మైదానంలో ఉన్నప్పుడు తాను, కోహ్లీ దాన్ని యుద్ధరంగంగా భావిస్తామని.. ఆట విషయంలో ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాని.. కోహ్లీ ఒక క్లాస్ ప్లేయర్ అని ప్రశంసలు కురిపించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *