గుజరాత్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Narendra Modi Droupadi Murmu

అహ్మదాబద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికే కుప్పకూలిపోయింది. అయితే ఈ ప్రమాదంపై దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

‘‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్రంగా కలచి వేసింది. ఇది హృదయ విదారకర ఘటన. మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం బాధితులకు తోడుగా ఉంటుంది’’: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

‘‘అహ్మదాబాద్ విమాన ప్రమాదం విని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది మాటలకందని విషాదం. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నా’’: ప్రధాని నరేంద్ర మోదీ

ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘటనస్థలికి వెళ్లారు. ప్రధాని మోదీ రామ్మోహన్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం చేయాలని.. ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్ చేయాలని కేంద్ర మంత్రిని ప్రధాని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *