Sirimalli

My WordPress Blog

Vijay – Rashmika : విజయ్-రష్మిక పెళ్లి హక్కుల కోసం ఓటీటీ సంస్థ భారీ ఆఫర్

Vijay Deverakonda Rashmika Mandanna Rejects There Wedding Deal

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారక ప్రకటన రానప్పటికీ ఈ నెల 26న వీరి పెళ్ళి జరగబోతుందని న్యూస్ వినిపిస్తోంది.అయితే ఇప్పుడు వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఓ భారీ డీల్‌ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో హక్కుల   కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 60 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.

సాధారణంగా సెలబ్రిటీల వివాహ వేడుకలను ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార – విఘ్నేష్ శివన్ వివాహ డాక్యుమెంటరీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ రికార్డును తిరగరాస్తూ విజయ్-రష్మిక జంటకు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంత భారీ మొత్తాన్ని విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన మరియు మధురమైన క్షణాలను వ్యాపార కోణంలో చూడటం తనకు ఇష్టం లేదని పెళ్లి జ్ఞాపకాలు అనేవి చాలా విలువైనవని, వాటిని కేవలం తన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా ఉంచుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన ఆ ‘మెగా ఆఫర్’కు విజయ్ “బిగ్ నో” చెప్పారనే వార్త ఇప్పుడు అభిమానుల మనసు గెలుచుకుంటోంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినా, తాజా నెట్‌ఫ్లిక్స్ డీల్ భారీ డీల్ ఆఫర్ చేయడం ఈ జంటకు ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేస్తుంది.