
Suryakumar Yadav: టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ అనంతరం టీంలో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టోర్నమెంట్ ప్రారంభోత్సవ వేడుకల సమయంలో తీసిన ఆ వీడియోలో టీమిండియా ఆటగాళ్లు ఎంతో హుషారుగా కనిపించారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహీ స్టేడియంలో డ్యాన్స్ ప్రదర్శన ఇస్తుండగా, సూర్యకుమార్ యాదవ్ సహా భారత ఆటగాళ్లు ఆసక్తిగా చూస్తూ ఆనందించారు. ఈ తరుణంలో కెమెరా ఒక్కసారిగా సూర్యకుమార్ వైపు తిరిగింది. కెప్టెన్ నవ్వుతూ థంబ్స్ అప్ చూపించడం స్పష్టంగా కనిపించింది. పక్కనే ఉన్న ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్ కెప్టెన్‌ను సరదాగా ఆటపట్టిస్తూ కనిపించారు. భారత ప్లేయర్స్ మైదానం బయట జట్టు ఎంత రిలాక్స్‌గా, స్నేహపూర్వకంగా ఉంటుందో ఈ వీడియో చూపించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ వీడియోను సూర్యకుమార్ యాదవ్ భార్యే చిత్రీకరించినట్లు తెలిసింది. ఈ వీడియోఎక్స్‌లో షేర్ కావడంతో అభిమానులు వైరల్ చేశారు.
READ MORE: Funky Oversees Review : ఫంకీ ఓవర్సీస్ రివ్యూ.. విశ్వక్ ఖాతాలో మరొక ప్లాప్?
ఇక టోర్నమెంట్ విషయానికి వస్తే.. నమీబియా మ్యాచ్ తర్వాత టీమిండియా అసలు పరీక్ష ఎదుర్కొనబోతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరు ముందుంది. ఆ మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది. వరల్డ్ కప్‌లలో భారత్ సాధారణంగా పాకిస్థాన్‌పై ఆధిపత్యం చాటింది. అయితే ఈసారి పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. పాకిస్థాన్ జట్టు తమ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడుతోంది. అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు వారు అలవాటు పడిపోయారు. ఇది వారికి కొంత ప్రయోజనంగా మారే అవకాశం ఉంది. అందుకే నమీబియా మ్యాచ్‌తో ఫామ్ కొనసాగించడం టీమిండియాకు చాలా కీలకం. మైదానంలో గంభీరంగా, మైదానం బయట సరదాగా ఉండే భారత జట్టు.. ఇప్పుడు వరుస విజయాలతో అభిమానులను మరింత ఉత్సాహపరచాలని చూస్తోంది.
Surya Kumar Yadav’s wife caught him in 4K watching Nora Fatehi’s dance performance at the opening ceremony. Hilarious reactions from Ishan Kishan and Arshdeep Singh!
#SuryaKumarYadav #IshanKishan #NoraFatehi pic.twitter.com/9paBbtQg3c
— Telugu Stride (@TeluguStride) February 12, 2026





