Sirimalli

My WordPress Blog

Suhas : రోల్ అని పిలిచి అవమానించారు.. కట్ చేస్తే అదే స్టార్ హీరోయిన్ పక్కన హీరోగా చేశా..!

Actor Suhas Insulted Early Career Keerthy Suresh Uppu Kappurambu Update

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలై, ఇప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. ప్రజంట్ ‘హే బల్వంత్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివాని నాగారం హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. గోపి అచ్చర దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో నరేష్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్ లో తన కెరీర్ మొదట్లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు సుహాస్.

Also Read : ManchuLakshmi: నిర్మాతగా ఇక నా పని అయిపోయింది.. ఐదేళ్ల క్రితం నాటి అప్పులు ఇంకా తీరుస్తూనే ఉన్నా

సుహాస్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు, ఒక పెద్ద సినిమాలో హీరోయిన్‌కు క్లోజ్‌గా ఉండే క్యారెక్టర్ ఉందని పిలిచారు. తీరా అక్కడికి వెళ్ళాక ఆ పాత్ర గురించి వివరించిన తీరు, నను చూసిన విధానం చాలా అవమానకరంగా అనిపించింది. ఆ క్షణం బాధ అనిపించినా, నా కష్టంపై నమ్మకంతో ముందడుగు వేశా. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్టుగా.. ఒకప్పుడు హీరోయిన్ పక్కన చిన్న రోల్ కోసం పిలిచి అవమానించిన ఇండస్ట్రీలో, ఇప్పుడు అదే స్టార్ హీరోయిన్ పక్కన సమానమైన గుర్తింపు ఉన్న పాత్రలో నటించా’ అని తెలిపాడు. ఈ పరిణామం సుహాస్ అభిమానులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. ప్రతిభ ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుందని సుహాస్ తన ఎదుగుదలతో నిరూపించారు. ప్రజంట్ ఈ హీరో మాటలు వైరల్ అవుతున్నాయి.