Sirimalli

My WordPress Blog

Shashi Tharoor: పార్లమెంట్ మెట్లపై జారిపడ్డ శశిథరూర్.. ‘తుఫాన్‌లో మండాల్సిన దీపం’’ అంటూ వీడియో పోస్ట్

Shashi Tharoor Fell On Stairs Of Parliament Complex Video Shared

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుండగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేవనెత్తి అంశాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకంలోని అంశాలు లేవనెత్తడంతో అధికార పార్టీ తీవ్రంగా తిప్పికొట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభా కార్యకలాపాలు కూడా సజావుగా సాగడం లేదు. దీంతో ఎనిమిది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Mrunal-Danush : “చెన్నై వాలా” అంటే ధనుషేనా? రిపోర్టర్ల ప్రశ్నలకు మృణాల్ ఠాకూర్ సిగ్గుల మొగ్గ!

దీంతో సస్పెండైన ఎంపీలంతా బుధవారం పార్లమెంట్ ద్వారం దగ్గర నిరసన తెలుపుతున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఫోన్ మాట్లాడుతూ మెట్లపై నుంచి జారీ పడ్డారు. వెంటనే పక్కనే ఉన్న అఖిలేష్ యాదవ్‌తో పాటు మరికొంత మంది ఎంపీలు వెంటనే పైకి లేపారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను శశిథరూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘తుఫానులో మండాల్సిన దీపాన్ని జాగ్రత్తగా నడపాలి. నేను బాగున్నాను.’’ అంటూ శశిథరూర్ వీడియో పోస్ట్ చేస్తూ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారో అర్థం కావడం లేదు.

సస్పెండైన ఎంపీలు వీరే.
హిబి ఈడెన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణిక్యం ఠాకూర్, గుర్జీత్ సింగ్ అజ్లా, ప్రశాంత్ యాదౌరావ్ పడోలే, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, డీన్ కురియాకోస్, సీపీఐ(ఎం) ఎంపీ ఎస్. వెంకటేశన్ ఉన్నారు.