అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి వంగా మూవీ: క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత!
స్టైలిష్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా, ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. చాలా కాలంగా సందిగ్ధంలో ఉన్న సందీప్ రెడ్డి వంగా సినిమాపై తాజాగా క్లారిటీ వచ్చింది.
గతంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ప్రకటించారు. అయినప్పటికీ, ‘పుష్ప 2’ ఆలస్యం కావడం, సందీప్ ‘స్పిరిట్’ పనుల్లో బిజీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ రద్దయ్యిందని ప్రచారం జరిగింది. కానీ, నిర్మాత భూషణ్ కుమార్ (T-Series) ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. దీంతో ఈ వదంతులకు చెక్ పడింది. తమ బ్యానర్‌లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ చిత్రాలతో పాటు అల్లు అర్జున్ సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆయన అధికారికంగా ధృవీకరించారు. దీంతో పుష్ప ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’, రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ పూర్తి చేసిన తర్వాతే బన్నీ-సందీప్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు. సో.. ఈ మూవీ వస్తే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండగే.

Leave a Reply