యుద్ధ క్షేత్రంలా మారిన కర్తవ్యపథ్! బ్యాటిల్ అరే ఫార్మాట్ లో సైన్యం విన్యాసాలు అద్భుతం అనే చెప్పాలి.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్ (Republic Day 2026) ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. తొలిసారిగా ‘బ్యాటిల్ అరే ఫార్మాట్’లో సైన్యం కవాతు నిర్వహించింది. అంటే, కేవలం ప్రదర్శనలా కాకుండా యుద్ధ క్షేత్రంలో సైన్యం ఎలా సిద్ధంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు.
ప్రధాన ఆకర్షణలు:
స్వదేశీ అస్త్రాలు: యుద్ధ ట్యాంకు ‘అర్జున్’, ‘బ్రహ్మోస్’, ‘ఆకాశ్’ క్షిపణి వ్యవస్థలతో పాటు 300 కి.మీ దూరం ప్రయాణించగల ‘సూర్యాస్త్ర’ రాకెట్ లాంచర్ వ్యవస్థను ప్రదర్శించారు.
ఆపరేషన్ సిందూర్: ఈ ఆపరేషన్‌లో కీలకపాత్ర పోషించిన S-400 క్షిపణి వ్యవస్థ, ‘నాగ్’ మిస్సైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కొత్త దళాలు: భైరవ్-లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్ మరియు జన్‌స్కార్ గుర్రాలు తొలిసారి కవాతులో పాల్గొన్నాయి.
త్రివిధ దళాల సమన్వయాన్ని చాటుతూ అపాచీ, ప్రచండ్ హెలికాప్టర్లు గగనతలంలో విన్యాసాలు చేయగా, ధ్రువ్ హెలికాప్టర్ ‘సిందూర్’ జెండాతో మెరిసింది. ఈ ప్రదర్శన భారత రక్షణ రంగం ఎంత శక్తిమంతంగా మారిందో నిరూపించింది.

Leave a Reply