Sirimalli

My WordPress Blog

Rakul: ఆ విషయంలో.. ఆడియన్స్‌ని మోసం చేయలేను..

Rakul Preet Singh Comments On Learning Language Indian 3

టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఢిల్లీ బ్యూటీ, వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంది. సాధారణంగా పరభాషా హీరోయిన్లు లిప్ సింక్ కోసం డైలాగులు రాకపోయినా మేనేజ్ చేస్తుంటారు. అయితే, ఈ పద్ధతిపై రకుల్ ఘాటుగా స్పందించారు. పని చేసే ఇండస్ట్రీ పట్ల గౌరవం ఎలా ఉండాలో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read :Virosh Wedding : ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక పెళ్లికి.. హాజరయ్యే గెస్ట్ లిస్ట్ ?

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ తన సినీ ప్రయాణం,భాషా పరిజ్ఞానం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ‘నేను స్వతహాగా మోసగాడిని కాదు. షూటింగ్ సమయంలో భాష తెలియకుండా కేవలం 1 2 3 4 లేదా ABCD అని అంకెలు, అక్షరాలు వల్లెవేస్తూ నా డైలాగ్ లైన్లను పూర్తి చేయలేను. ఏ పరిశ్రమ అయితే మనకు అన్నం పెడుతుందో, ఏ ప్రేక్షకులు అయితే మనకు అపారమైన ప్రేమాభిమానాలు అందిస్తారో.. ఆ ఇండస్ట్రీకి మనం ఇచ్చే కనీస గౌరవం అక్కడి భాషను నేర్చుకోవడమే’ అని రకుల్ స్పష్టం చేశారు. కేవలం డైలాగులు చెప్పడం కోసం కాకుండా, పాత్రలోని భావాన్ని పండించాలంటే భాషా ప్రావీణ్యం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.