Sirimalli

My WordPress Blog

Railway ALP Recruitment 2026: పది పాసైతే చాలు.. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు మీవే.. పూర్తి వివరాలు

Railway Ministry Approves Recruitment For 11127 Assistant Loco Pilot Posts

రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవలే ఆఆర్బీ గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు మరో నోటిఫికేషన్ కు రెడీ అవుతోంది. అసిస్టెంట్ లోకో పైలట్స్ (ALPs) కోసం కొత్త నియామకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేస్తారు. దక్షిణ మధ్య రైల్వేలో 674 పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) త్వరలో ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది.

Also Read:Pradeep Ranganathan : ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్.. ఆ బ్యూటీతో తొలి ప్రాజెక్ట్!

రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా 10వ తరగతితో పాటు ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొంది ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన అభ్యర్థులు కూడా ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. OBC, SC/ST వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. నిబంధనల ప్రకారం ఇతర రిజర్వ్డ్ కేటగిరీలు, మాజీ సైనికులకు 5 సంవత్సరాల సడలింపు ఇవ్వబడుతుంది. అభ్యర్థులను CBT 1, CBT 2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ (ME) ద్వారా ఎంపిక చేస్తారు. రూ. 500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST/మాజీ సైనికులు/ట్రాన్స్‌జెండర్లు/EBCలకు దరఖాస్తు రుసుము రూ. 250.